HBD Salmankhan.. మెగాస్టార్ అలా.. మహేష్ బాబు ఇలా.. వెంకీమామ స్పెషల్ ట్వీట్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ టాలీవుడ్ స్టార్లతో మంచి సంబంధాలను కొనసాగిస్తుంటాడు. మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ మెగా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడు. థమ్సప్ యాడ్ కోసం సల్మాన్ ఖాన్, చిరంజీవి కలిసి నటించారు. అప్పటి నుంచి ఇలా ఈ ఇద్దరి మధ్య స్నేహబంధం కుదిరింది. ఇక నేటి సల్మాన్ ఖాన్ బర్త్ డే (డిసెంబర్ 27) సందర్భంగా మన టాలీవుడ్ స్టార్స్ స్పెషల్ విషెస్ అందిస్తున్నారు.

సోషల్ మీడియాలో విషెస్..
సల్మాన్ ఖాన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు సల్మాన్‌కు విషెస్ చెబుతున్నారు.ఇక అభిమానులుసోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. నేటి ఉదయం నుంచి సల్మాన్ ఖాన్ బర్త్ డే ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతూనే ఉంది. తాజాగా మన తెలుగు స్టార్స్ సల్మాన్‌కు స్పెషల్ విషెస్ అందించారు.

దయాగుణం..
నా ప్రియమైన సోదరుడు, స్నేహితుడు.. ఎంతో మంచి వాడు.. దయా గుణం కలిగిన సల్మాన్ ఖాన్‌కు హ్యాపీ బర్త్ డే అంటూ విక్టరీ వెంకటేష్ ట్వీట్ చేశాడు. సల్మాన్ ఖాన్‌తో గతంలో దిగిన ఫోటోను షేర్ చేస్తూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఎల్లప్పుడూ విజయాలు వరించాలి.. సుఖశాంతులతో ముందుకు సాగాలి అంటూ సల్మాన్‌పై ప్రేమను కురిపించాడు.

మహేష్ బాబు అలా..
బాలీవుడ్ సూపర్ స్టార్‌కు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విషెస్ అందించాడు. సూపర్ కూల్ సల్మాన్ ఖాన్‌కు స్పెషల్‌గా హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశాడు. ఆయురారోగ్యాలతో సుఖశాంతులు చేకూరాలని మహేష్ బాబు కోరాడు. ఈ మేరకు మహేష్ బాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Recommended Video

చిరంజీవి ఇలా..
మెగాస్టార్ చిరంజీవికి సల్మాన్ ఖాన్‌కు ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. ఇక సల్మాన్ ఖాన్ బర్త్ డే నాడు చిరంజీవి విషెస్ చెప్పకుండా ఉంటాడా? తాజాగా చిరు సల్మాన్ ఖాన్‌కు విషెస్ తెలిపాడు. ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్‌కు హ్యాపీ బర్త్ డే. ఆయురారోగ్యాలతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలని చిరంజీవి కోరాడు.


Click it and Unblock the Notifications











