HBDSSRajamouli.. జక్కన్న, మెంటర్ అంటూ ఎన్టీఆర్, చెర్రీ.. హద్దులు చెరిపేయాలంటూ మహేష్
దర్శక ధీరుడు రాజమౌళి పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 10). రాజమౌళి కేవలం తెలుగు సినిమా పరిశ్రమకు మాత్రమే ప్రతినిధి కాదు. అంతర్జాతీయ స్థాయిలో భారత చిత్ర పరిశ్రమకు అధికారిక ముద్రలా మారిపోయాడు. ఇంత వరకు అపజయం ఎరగని తిరుగులేని దర్శకుడిగా రాజమౌళికి రికార్డ్ ఉంది. బాహుబలి చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇక నేటి జక్కన్న బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా దద్దరిల్లిపోతోంది. ఈ క్రమంలో మన హీరోలు, దర్శక నిర్మాతలందరూ ట్వీట్స్ చేస్తూ విషెస్ తెలుపుతున్నారు.
Recommended Video

నా మెంటర్ రాజమౌళి
రామ్ చరణ్, రాజమౌళి మధ్య ఉన్న బంధం గురించి తెలిసిందే. వీరి కాంబోలో మగధీర ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఇక మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ పని పట్టేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాబోతోన్నారు. తాజాగా రామ చరణ్ స్పందిస్తూ.. క్రిటిక్స్ ఎక్కువగా వినిపించినా.. అతని సక్సెస్ అంత కంటే గట్టిగా వినిపిస్తుంది.. నా మెంటర్ రాజమౌళి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. అనంతమైన ప్రేమతో అంటూ ట్వీట్ చేశాడు.

హద్దులను చెరిపేయాలి..
తెలుగు చిత్ర సీమలో ఓ కాంబో కోసం ఎప్పటి నుంచో అందరూ ఎదురుచూస్తున్నారు. అదే రాజమౌళి-మహేష్ బాబు కాంబో. ఆర్ఆర్ఆర్ తరువాత మహేష్ బాబుతో సినిమా ఉంటుందని రాజమౌళి ప్రకటించేశాడు. తాజాగా మహేష్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘రాజమౌళికి గారికి హ్యాపీ బర్త్ డే. ఇంకా ఇలాగే మీ చిత్రాలతో మన సరిహద్దులను చెరిపేయాలి.. మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ దేవుడ్ని కోరుతున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్యూ
ఎన్టీఆర్-రాజమౌళి బంధం ఈనాటిది కాదు. ఇద్దరి కెరీర్ కూడా దాదాపు ఒకే సమయంలో ఒకే సినిమాతో ప్రారంభమైంది. స్టూడెంట్ నెం.1 చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం, స్నేహం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఎప్పటికీ అలానే ఉంటుంది కూడా. ఇప్పటికే వీరి కాంబోలో హ్యాట్రిక్ వచ్చేసింది. ఇక ఆర్ఆర్ఆర్‌తో మరో హ్యాట్రిక్‌కు సిద్దమవుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘హ్యాపీ బర్త్ డే జక్కన్న. లవ్యూ' అంటూ సింపుల్‌గా రాజమౌళిపై ఉన్న ప్రేమను తెలిపాడు.

ఎంతో గౌరవం
బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తాజాగా ట్వీట్ చేశాడు. ‘రాజమౌళి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీ గురించి తెలుసుకోవడం, మీతో ఇలా ఆర్ఆర్ఆర్ కోసం పని చేయడం ఎంతో గౌరవంగా ఫీలవుతున్నాను. మీకెల్లప్పుడూ మంచే జరగాలి సర్' అంటూ జక్కన్నపై ప్రేమను కురిపించాడు.

అక్టోబర్ 22 వరకు ఆగలేకపోతోన్నా
‘రాజమౌళి సర్‌కి హ్యాపీ బర్త్ డే. మీకున్న డిటర్మినేషన్‌తో మీ కలలను ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నారు. అదే గొప్ప విజయాన్ని అందిస్తోంది. మీకు సుఖ శాంతులు చేకూరాలని ఆ దేవుడిని కోరతున్నాను.. మన తారక్‌ను కొమరం భీంగా చూడాలని ఎదురుచూస్తాను.. అక్టోబర్ 22 వరకు ఆగలేకపోతోన్నా' అంటూ డైరెక్టర్ బాబీ ట్వీట్ చేశాడు.

మన తెలుగు సినిమా ఖ్యాతి
‘హ్యాపీ బర్త్ డే రాజమౌళి గారు.. ఇంకా అలా వెలుగుతూనే ఉండాలి.. మన తెలుగు సినిమా ఖ్యాతిని అలా అంచెలంచెలు ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాలి అని కోరుతున్నానంటూ' అనిల్ రావిపూడి ట్వీట్ చేశాడు. ఇలా చిత్ర ప్రముఖలందరూ రాజమౌళికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Click it and Unblock the Notifications











