HBD Rajinikanth: రజినీకాంత్‌ ఆస్తుల విలువ ఇదే.. ఒక్క సినిమాకే అన్ని కోట్లు.. ఏకైక హీరోగా రికార్డు

బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన శైలి విలక్షణమైన నటనతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. విభిన్నమైన శైలితో ఆకట్టుకున్న ఆయన.. ఎన్నో ఏళ్లుగా సినీ రంగంపై తన మార్క్ చూపిస్తున్నారు. ఒకవైపు కుర్ర హీరోలు దూసుకుపోతున్నా.. తన హవాను ఏమాత్రం తగ్గించకుండా సత్తా చాటుతున్నారాయన. ఈ నేపథ్యంలో నేడు ఆయన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మొత్తం ఆస్తులు, ఒక్కో సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ వివరాలు మీకోసం!

బస్ కండక్టర్.. సినిమాల బాట

బస్ కండక్టర్.. సినిమాల బాట


రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్.. బెంగళూరులో స్థిరపడిన ఒక మరాఠా కుటుంబంలో 1950 డిసెంబర్ 12న జన్మించారు. చిన్నప్పటి నుంచే యాక్టింగ్‌పై ఉన్న పిచ్చితో స్టేజ్‌లపై నాటకాలు వేసేవారు. ఆ తర్వాత బస్ కండక్టర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఈ క్రమంలోనే మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి వచ్చిన నోటిఫికేషన్ చూసి అందులో అడ్మీషన్ తీసుకున్నారు.

అలా మొదలైన ఆయన జర్నీ

అలా మొదలైన ఆయన జర్నీ

మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన తర్వాత రజినీకాంత్‌కు టాలెంట్‌కు అక్కడి వాళ్లు ముగ్ధులయ్యారు. ఆ సమయంలోనే లెజెండరీ డైరెక్టర్ బాలచందర్.. ఆయనలోని నైపుణ్యాన్ని చూసి 'అపూర్వ రాగంగళ్' అనే సినిమాలో నటించే ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చిన్న పాత్రలు పోషించిన రజినీకాంత్.. సోలో హీరోగా మారి సూపర్ స్టార్‌గా ఎదిగిపోయారు.

దేశమే గర్వించే స్థాయికి ఎదిగి

దేశమే గర్వించే స్థాయికి ఎదిగి

దేశమే గర్వించే స్థాయికి ఎదిగి
కోలీవుడ్ హీరోగా పేరు తెచ్చుకున్న రజినీకాంత్ దక్షిణ భారతదేశంలోని అన్ని భాషల్లో నటించారు. ముఖ్యంగా తెలుగులో 'టైగర్' అనే సినిమాలో ఎన్టీఆర్‌కు సోదరుడిగా చేసిన ఆయన.. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేశారు. ఆ తర్వాత తన చిత్రాలను తెలుగుతో పాటు అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసి మంచి మార్కెట్ అందుకున్నారు. ఫలితంగా దేశం గర్వించే స్థాయికి చేరారు.

అక్కడ కూడా.. ఏకైక హీరోగానే

అక్కడ కూడా.. ఏకైక హీరోగానే


సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో రజినీకాంత్ ఎన్నో అవార్డులు, రివార్డులు, పురస్కారాలను సొంతం చేసుకున్నారు. ఇవి మాత్రమే కాదు.. జపాన్, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాల్లో ఫ్యాన్‌బేస్ కలిగిన ఏకైక ఇండియన్ హీరోగా రికార్డులకెక్కారు. అలాగే, ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే కొన్ని దేశాల్లో సెలవులు కూడా ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

వరుస ఫ్లాప్‌లు.. జైలర్‌గా మారి

వరుస ఫ్లాప్‌లు.. జైలర్‌గా మారి

సూపర్ స్టార్ రజినీకాంత్ కొంత కాలంగా వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది 'అన్నత్తే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సిరిత్తి శివ తెరకెక్కించిన దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక, ఇప్పుడు ఆయన 'జైలర్' అనే సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే.

రజినీకాంత్ మొత్తం ఆస్తులు

రజినీకాంత్ మొత్తం ఆస్తులు


సినీ రంగంలో తనదైన శైలి నటనతో ఆకట్టుకుంటోన్న రజినీకాంత్ ఎన్నో ఆస్తులను కూడా కూడబెట్టుకున్నారు. అలాగే, తమిళ మీడియా లెక్కల ప్రకారం.. ఆయనకు ప్రస్తుతం దాదాపు రూ. 400 - 450 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిసింది. అలాగే, రూ. 25 కోట్ల విలువైన కార్లు, రూ. 25 కోట్ల విలువున్న యాక్ససిరీస్‌లు, రూ. 100 కోట్లు విలువ ఉన్న కొన్ని స్థలాలు కూడా ఉన్నాయని టాక్.

రజినీక రెమ్యూనరేషన్ ఎంత

రజినీక రెమ్యూనరేషన్ ఎంత


రజినీకాంత్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో మార్కెట్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆయన ప్రతి సినిమాకు రూ. 50 - 60 కోట్లు రెమ్యూనరేషన్‌గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక, అంత సంపాదన ఉన్న తలైవా అందులో చాలా వరకూ ప్రజా సంక్షేమం కోసం ఖర్చ చేస్తున్నారు. తద్వారా ఆయన ఎంతో మందికి అండగా నిలుస్తూ ఆదర్శంగా ఉంటోన్నారు.

నేడు సూపర్ స్టార్ రజినీకాంత్ జన్మదినం. ఆయన ఇలాగే మరిన్ని పుట్టినరోజులు ఇలాగే జరుపుకోవాలని కోరుకుంటూ.. తలైవాకు తెలుగు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X