HBD Venkatesh.. చిరు, మహేష్ విషెస్ వైరల్.. మోర్ ఫన్ అంటూ F3తో వెంకీ రచ్చ

విక్టరీ వెంకటేష్ బర్త్ డే (డిసెంబర్ 13) నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వెంకీ మామ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. కొత్త సినిమా అప్డేట్లతో సందడి చేస్తున్నాడు. నారప్ప చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాజాగా ఎఫ్ 2 సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్‌ను కూడా ఇచ్చాడు. ఇవి కాకుండా వెంకీమామకు సోషల్ మీడియాలో సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ చెప్పే విషెస్‌లు వైరల్ అవుతున్నాయి.

Recommended Video

HBD Victory Venkatesh : Narappa Glimpse F3 Movie Announced | Oneindia Telugu

కుష్బూ అలా..

కుష్బూ, వెంకటేష్ ఒకే సారి సినీ తెరంగేట్రం చేశారు. కలియుగ పాండవులు సినిమాతో తెరకు పరిచయమయ్యారు. నాటి రోజులను గుర్తు చేసుకుంటూ నేడు వెంకీకి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇన్నేళ్లుగా ఇలా మన స్నేహం కొనసాగుతుంది, ఇలా ప్రయాణం ముందుకు వెళ్తుందని ఆ రోజు మనం అనుకోలేదంటూ కుష్బూ ఎమోషనల్ అయింది.

మహేష్ బాబు అలా..

మహేష్ బాబు వెంకటేష్ అనగానే అందరికీ చిన్నోడు పెద్దోడు గుర్తుకు వస్తారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో మళ్లీ మల్టీస్టారర్ కాలానికి తెరదీశారు. మహేష్ బాబు ఆ బంధాన్ని కొనసాగిస్తూ తాజాగా వెంకటేష్‌కు బర్త్ డే విషెస్ తెలిపాడు. సూపర్ కూల్ అంటూ వెంకీమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

చిరు ఇలా..

వెంకటేష్‌కు ఆధ్యాత్మిక భావన ఎక్కువే.. అదే సమయంలో తెరపై హాస్యాన్ని పండించడంలోనూ దిట్టే. ఈ రెండు భిన్న కోణాలను చూసి ఎప్పుడూ ఆశ్చర్యపోతానంటూ చిరు చెప్పుకొచ్చాడు. నారప్ప లుక్ ఎంతోఅద్భుతంగా ఉందంటూ వెంకటేష్‌కు బర్త్ డే విషెస్ చెప్పాడు.

ఇస్మార్ట్ రామ్ విషెస్..

మసాలా సినిమాతో రామ్, వెంకటేష్ కలిసి మల్టీస్టారర్ సినిమాను తీశాడు. బాలీవుడ్ రీమేక్‌గా తెరకెక్కించిన మసాల అంతగా ఆకట్టుకోకకపోయినా రామ్ వెంకీ కామెడీ టైమింగ్, కెమిస్ట్రీ బాగా కుదిరింది. అలాంటి టైమింగ్‌తోనే రామ్ తాజాగా వెంకటేష్‌కు విషెస్ తెలిపాడు. నేను కలిసి వారిల్లో అద్భుతమైన వ్యక్తి వెంకటేష్.. ఆయనకు హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశాడు.

అనిల్ రావిపూడి గిఫ్ట్..

అనిల్ రావిపూడి బర్త్ డే విషెస్ చెబుతూ.. ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన కాన్పెస్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే ఈ సారి మోర్ ఫన్ అంటూ.. డబ్బులను చూపించాడు. అంటే ఈసారి పెళ్లాలు డబ్బుల కోసం మొగుళ్లను పీక్కు తింటారేమో. మొత్తానికి ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రెడీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X