ఆ సినిమాలపై చర్యలు తీసుకోండి..హైకోర్టు

సినిమాల్లో అశ్లీలతపై ప్రజాసత్తా అనే స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు అహమ్మద్ వలీ షేక్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ అనిల్ రమేశ్ దవె, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం విచారణ జరిపింది. సెన్సార్ బోర్డు మీద పిటిషనర్ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించగా.. పిటిషనర్ పంపిన చిత్రాలన్నీ సెన్సారైన సినిమాల్లోనివేనని బెంచ్ వ్యాఖ్యానించింది. ఇదిలాఉండగా, పత్రికల్లో ప్రచురితమవుతున్న చిత్రాలపై అభ్యంతరాలు తెలియజేస్తూ కృష్ణా జిల్లాలోని వివిధ జూనియర్ కళాశాలలకు చెందిన 486 మంది విద్యార్థులు హైకోర్టుకు లేఖలు రాశారని.. వాటిని కూడా ఈ పిటిషన్‌కు జత చేసినట్లు ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి డి.సుబ్రహ్మణ్యం తెలిపారు.
movies telugu censor board high court warangal acid attack tv channels వరంగల్ హైకోర్టు సెన్సార్ బోర్డు


Click it and Unblock the Notifications