twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రీతీజింటాకు హైకోర్టులో ఎదురుదెబ్బ

    By Srikanya
    |

    ముంబయి: చెల్లని చెక్కు కేసులో బాలీవుడ్‌ నటి ప్రీతీజింటాకు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మేజిస్ట్రేట్‌ కోర్టులో జరుగుతున్న కేసు విచారణ ప్రక్రియను కొట్టివేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రీతి దిగువ కోర్టులోనే విచారణ ఎదుర్కోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

    'ఇష్క్‌ ఇన్‌ పారిస్‌' చిత్రానికి స్క్రిప్ట్‌ రాసినందుకు తనకు ప్రీతి రూ.18.9 లక్షల చెక్‌ ఇచ్చారని, అయితే అది చెల్లుబాటు కాలేదని... రచయిత అబ్బాస్‌ టైర్‌వాలా మేజిస్ట్రేట్‌ కోర్టులో కేసు వేశారు. గతంలోనూ ఆమెపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. ఈ కేసులో ముంబై కోర్టు ఇంతకు ముందు ఆమెకు సమన్లు జారీ చేసింది. వరుసగా నాలుగు సార్లు కోర్టుకు ప్రీతి జింటా హాజరు కాలేదు. దీంతో గురువారం ప్రీతి జింటా అరెస్టుకు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది.

    ఇక తాను రాజకీయాల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రకటన చేసి ప్రీతి జింటా ఇంతకు ముందు వార్తల్లోకి ఎక్కారు. దేశంలోని అవినీతిని అంతం చేయడానికి తాను రాజకీయాల్లో చేరాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. మనదేశంలో సంభవిస్తున్న పరిణామాలు చాలా విచారకరంగా ఉన్నాయని, దాంతో తాను రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నానని ప్రీతి జింటా ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో చెప్పారు. దేశాన్ని సానుకూల దిశలో నడిపించడానికి ఏదో ఒక రోజు తాను రాజకీయాల్లోకి వచ్చి తనకు ఓటు వేయాలని కోరుతానని చెప్పారు.

    English summary
    In a setback to actress Preity Zinta, the Bombay High Court refused to quash proceedings against her in a cheque bounce case filed by scriptwriter Abbas Tyrewala in a magistrates court, asking her to face trial. Justice Sadhana Jadhav, hearing Zintas plea, held that high court would not quash the case and asked the actress to produce in the lower court whatever material she had.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X