»   » వివాదం: రజనీకాంత్ కోర్టుకు హాజరు కావాల్సిందే!

వివాదం: రజనీకాంత్ కోర్టుకు హాజరు కావాల్సిందే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు రజనీకాంత్, ఆయన సతీమణి లతలకు మద్రాసు హైకోర్టు సమన్లు జారీ చేసింది. ‘ఆశ్రమ్ మెట్రిక్యులేషన్ స్కూల్' స్థల వివాదానికి సంబందించిన విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. చెన్నై లోని రేస్ కోర్స్ ప్రాంతంలో రజనీకాంత్ కు చెందిన ఈ పాఠశాల స్థలంపై గత కొంతకాలంగా కోర్టు విచారణ జరుగుతోంది.

HC refuses to stay notice against actor Rajinikanth

జనవరి 27న విచారణకు రజనీ హాజరు కావాల్సి ఉన్నా హాజరు కాలేదు. దీంతో తమిళనాడు మెట్రిక్యులేషన్ పాఠశాలల జాయింట్ డైరెక్టర్ వారికి సమన్లు పంపారు. అయితే ఈ కేసులో రజనీకాంత్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పాఠశాల ప్రిన్సిపల్ వందన వేసిన రిట్ పిటీషన్‌ను హైకోర్టు తోసి పుచ్చింది.

రజనీకాంత్ హాజరు కావడానికి అవసరమైతే రెండు వారాలు గడువు పెంచుతామని కోర్టు తేల్చి చెప్పంది. వ్యక్తిగత హాజరు నుంచి రజనీకాంత్ కు మినహాయింపు ఇవ్వడం కుదరదని హైరోర్టు ఉత్తర్వులో స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ తప్పని సరిగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

English summary
Madras HC refuses to stay order on personal appearance of Rajinikanth in School land case.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu