నటి విద్యా బాలన్‌కు కోర్టు ఊరట
బాలీవుడ్ నటి విద్యాబాలన్ కు రాష్ట్ర హైకోర్టు కాస్త ఊరటనిచ్చింది. విద్యా బాలన్ పై హైదరాబాద్ నల్లకుంట పోలీసులు నమోదు చేసిన కేసు విచారణపై గురువారం స్టే విధించింది.
డర్టీ పిక్చర్ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజుల క్రితం సాయికృష్ణ ఆజాద్ అనే న్యాయవాది నాంపల్లి కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆజాద్ పిటీషన్ ను సవాలు చేస్తూ విద్యా బాలన్ బుదవారం హైకోర్టులో పిటీషన్ వేసింది. తనపై విచారణ ఆపాలని కోర్టును వేడుకుంది. విద్యా పిటీషన్ విచారణకు స్వీకరించిన కోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన 'డర్టీ పిక్చర్' సినిమాలో స్మిత పాత్రను పోషించిన విద్యా బాలన్ ఏమాత్రం సిగ్గు పడకుండా హాట్ హాట్ గా అందాలు ఆరబోసింది. ఆవిడ అందాలు, నటనకు కోట్లాది రూపాయల వసూళ్లు కూడా రాలాయి. ఏది ఏమైనా ఈ కోర్టు వివాదాలు కూడా డర్టీ పిక్చర్ పై అంచనాలు పెంచి, మరిన్ని వసూళ్లు సాధించేలా చేసిందనేది కాదనలేని వాస్తవం.


Click it and Unblock the Notifications











