»   » షాకింగ్: 60 కోట్లతో మాజీ సీఎం కొడుకుతో పూరి సినిమా!

షాకింగ్: 60 కోట్లతో మాజీ సీఎం కొడుకుతో పూరి సినిమా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి దేవెగౌడ తన కుమారుడు నిఖిల్ కుమారస్వామిని హీరోగా పెట్టి 60 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో సినిమా తీయడం చర్చనీయాంశం అయింది. సాధారణంగా కన్నడలో చిన్న సినిమాలు నాలుగు కోట్ల రూపాయలకు మించి ఖర్చుపెట్టరు. సూపర్ స్టార్ సినిమాలకు కూడా 12 కోట్ల రూపాయలకు మించి ఖర్చుపెట్టరు. అలాంటిది రూ. 60 కోట్లు ఏమిటని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించనున్నట్టు కన్నడ సినిమా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కుమారస్వామి దేవెగౌడ రాజకీయాల్లోకి రాకముందు చిత్ర నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా, డిస్ట్రిబ్యూటర్‌గా కొనసాగారు. సినిమాలపై ఆసక్తితో తన కొడుకును స్టార్ హీరో చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రస్తుతం నిఖిల్ కుమార స్వామి విదేశాల్లో శిక్షణ తీసుకుంటున్నాడు.

Nikhil Gowda
English summary
Former Karnataka Chief Minister HD Kumaraswamy, according to reports, is launching his son Nikhil Gowda in a Rs 60-crore Kannada film. Apart from being the costliest ever film to be made in the South, this will also be a dream-launch of sorts for any new actor - given the fact that no other debutant in the South, including sons of superstars, has been launched with this high budgeted a film.
Please Wait while comments are loading...