పులి ఎలా గర్జింస్తుందో సినిమా కూడా అదేరేంజ్ లో ఉంటుంది..!
ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. దేనికంటే ప్రస్తుతం ఆయన నటించిన కోమరం పులి ఈ నెల 9 వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కోమరం పులి చిత్ర దర్శకుడు ఎస్.జె. సూర్య పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను చూసిన హీరోల అందరిలోకెల్లా పవన్ కళ్యాణ్ గారికి సమకాలీన అంశాలపై అవగాహన ఉంది. హీరోగా అంత స్టార్ ఇమేజ్ ఉండి కూడా చాలా సింపుల్ గా ఉండడం ఆయనకే సాధ్యం. సెట్లో కూడా అందరితో కలసిపోయి, సరదాగా ఉంటారు.
ఆయన నిజజీవితంలో ఎలా ఉంటారో దానిని స్పూర్తిగా తీసుకోని కోమరం పులిని తీశాను, ఇందులో పవర్ స్టార్ పవర్ పుల్ గా డైలాగ్స్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా పులి ఎలా గర్జింస్తుందో చూడాలంటే ఈ నెల 9 వరకు ఆగాల్సిందే. ఏ సీన్ కా సీన్ రష్ చూసుకుంటున్నప్పుడు ఇలాంటి సీన్స్ చెయ్యాలంటే పవన్ కళ్యాణ్ తర్వాతనే ఎవరైనా అని అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారితో ఖుషీ తర్వాత కోమరం పులి చేయడానికి నాకు పదేళ్శు పట్టిందన్నారు. దీనిని బట్టి మీకు అర్దం చేసుకోవచ్చు సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఎస్.జె. సూర్య తన మనోభావాలను వెల్లడించడం జరిగింది.


Click it and Unblock the Notifications











