RRR: మగధీర నుంచే రాజమౌళిపై కన్ను, నా పాత్ర కష్టమే.. మైండ్ బ్లోయింగ్ అంటున్న అలియా!

Recommended Video

Alia Bhatt Responds On Her Character In RRR Movie || Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ జోరందుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్ర తదుపరి షెడ్యూల్స్ ఎక్కువగా నార్త్ ఇండియాలో జరగనున్నాయి. పూణే, వడోదర, కోల్ కతా లాంటి నగరాల్లో చరణ్, ఎన్టీఆర్ పై రాజమౌళి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో, రాంచరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాంచరణ్ కు జోడిగా సీత పాత్రలో నటిస్తున్న అలియా భట్ ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

 కష్టమైన పాత్ర

కష్టమైన పాత్ర

తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలు, రాజమౌళి గురించి ఆసక్తికర విషయాలు అలియా భట్ వెల్లడించింది. ఆర్ఆర్ఆర్ చిత్రం పట్ల చాలా ఆసక్తిగా ఉన్నాను. నేను నటించబోయే పాత్ర చాలా కష్టమైనది. అయినా పర్వాలేదు.. నటించగలననే నమ్మకం ఉంది. వరుసగా క్రేజీ దర్శకులతో పనిచేస్తున్న సమయంలో రాజమౌళి దర్శకత్వంలో నటించే అవాకాశం వచ్చిందని అలియా భట్ తెలిపింది.

 మగధీర నుంచే

మగధీర నుంచే

రాజమౌళి బాహుబలి చిత్రం తీశారని తాను ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఒప్పుకోలేదని, అంతకు ముందు నుంచే ఆయన చిత్రాలు చూస్తున్నానని అలియా భట్ పేర్కొంది. మగధీర, ఈగ లాంటి చిత్రాలని చూశా. సింపుల్ కథలని మతిపోగొట్టేవిధంగా ఆయన ప్రజెంట్ చేయగలరు. రాజమౌళి ఇమాజినేషన్ ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లుగా ఉంటుంది. అందుకే ఆయన ఇండియన్ సినిమాలో అంత పెద్ద దర్శకుడిగా ఎదిగారని అలియా భట్ పేర్కొంది.

పవర్ ఫుల్ కథలు

పవర్ ఫుల్ కథలు

రాజమౌళి కథలు ఎమోషనల్ గా, పవర్ ఫుల్ గా ఉంటాయి. ఆర్ఆర్ఆర్ కథ చాలా బలమైనది. దానిని ఆయన వెండి తెరపై ఎలా ప్రజెంట్ చేస్తారనే విషయంలో తాను కూడా ఆసక్తిగా ఉన్నట్లు అలియా పేర్కొంది. రాంచరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతా రామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి మరదలిగా అలియా భట్ సీత పాత్రలో నటించనుంది. జూ. ఎన్టీఆర్ కొమరం బీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కు హీరోయిన్ ని ఎంపిక చేయాల్సి ఉంది.

భారీ చిత్రాలలో

భారీ చిత్రాలలో

అలియా భట్ ఖాతాలో ప్రస్తుతం భారీ చిత్రాలు ఉన్నాయి. కళంక్, బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్ లాంటి వందల కోట్ల బిజినెస్ చిత్రాల్లో అలియా నటిస్తోంది. అలియా భట్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్. అలియా భట్ తదుపరి జరగబోయే నార్త్ ఇండియా షెడ్యూల్ లో ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొననుంది. రాంచరణ్ కు గాయం కావడం వలన మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X