'నా బలం..నా సూపర్ పవర్ ఆయనే'... మంచు లక్ష్మీ ప్రసన్న
మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న తాజాగా తన భర్త గురించి ట్వీట్ చేసింది. అందులో..మా ఆయన పేరు లక్ష్మీనారాయణ్ శ్రీనివాసన్, నా పేరుకి ఆయన పేరుని వెనక కలుపుకుంటే. లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ నారాయణ్ అవుతుంది. మేము మా వివాహంలో మాకంటూ కొన్ని రూల్స్ పెట్టుకున్నాం. మా వైవాహిక జీవితం సూపర్ హ్యాపీ. నా బలం,నా సూపర్ పవర్ ఆయనే. ఇక మీరు ఆయన్ని ఆండీ అనే నిక్ నేమ్ తో ఎప్పటిలా పిలవచ్చు అంటూ ట్వీట్ చేసింది. ఇక లక్ష్మీ ప్రసన్న ఝుమ్మందినాదం చిత్రం నిర్మించి గ్యాప్ తీసుకంది. ప్రస్తుతం సిద్దార్ద హీరోగా చేస్తున్న అనగనగా ఒక ధీరుడు చిత్రంలో లేడీ విలన్ గా చేస్తోంది. అలాగే త్వరలో లక్ష్మీ టాక్ షోను మళ్ళీ ప్రారంభించటానికి సన్నాహాలు చేసుకుంటోంది.
లక్ష్మీ ప్రసన్న రాఘవేంద్రరావు తాప్సీ ఝుమ్మంది నాదం laxmi prasanna manoj kumar raghavendra rao tapsi mohan babu


Click it and Unblock the Notifications