టాగ్ లైన్ ఫర్‘గబ్బర్ సింగ్- హి ఈజ్ స్పెషల్’...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గబ్బర్ సింగ్". పవన్ కు పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని తీన్ మార్ నిర్మాత గణేష్ నిర్మిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
పవన్ కల్యాణ్ నటించే 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగు ఈ నెల 9 న హైదరాబాదులో ప్రారంభం అవుతోంది. ఈ సినిమా కోసం హైదరాబాదు శివారులోని కోకాపేట్ లో వేస్తున్న భారీ సెట్లో షూటింగ్ ప్రారంభిస్తారు. విలన్ హౌస్ కు సంబంధించిన వర్క్ ను ఈ సెట్ లో చేస్తారు. ఇందులో విలన్ గా అభిమన్యు సింగ్ నటిస్తున్నాడు. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ అయిన 'దబాంగ్' లో ఈ పాత్రను సోనూసూద్ చేశాడు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా శృతిహాసన్ నటిస్తోంది.
పవన్ కళ్యాణ్ రేంజ్ కు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం హరీష్ శంకర్ కొత్తగా డైలాగులను రాయడం, స్ర్కిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడు. అయితే పవన్ అభిమానులకు ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నామని, అదే విధంగా ఈ చిత్రానికి 'హి ఈజ్ స్పెషల్" అనే ట్యాగ్ లైన్ పెట్టినట్లు హరీష్ శంకర్ తెలియజేశాడు..


Click it and Unblock the Notifications











