»   » ఆయన చాలా మంచి వారు అందుకే కలిశాను అంతే అది తప్పా..!

ఆయన చాలా మంచి వారు అందుకే కలిశాను అంతే అది తప్పా..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ రోజుల్లో ఒక హీరోయిన్ ఓ దర్శకుడు ప్రత్యేకంగా కలసి మాట్లాడినప్పుడో , ఏదైనా దర్శకుడితో హీరో చర్చలు జరిపితేనో వారి కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ఆరంభం అవుతుందనే వార్తలు ఫిలింనగర్ లో ప్రచారం అవుతాయి. ఇలాంటి సీనే ఇటీవల కాలంలో ఒకటి జరిగింది. గోవా బ్యూటి ఇలియానా గురువారం రామ్ గోపాల్ వర్మను కలిశారు. ఐతే రామ్ గోపాల్ వర్మ తదుపరి చిత్రంలో ఇలియానా కధానాయిక అనుకుంటే మాత్రం పోరపాటే అంటున్నారు. ఈ విషయాన్ని ఇలియాననే స్వయంగా ప్రకటించారు. రరామ్ గోపాల్ వర్మ గారిని కలసిన మాట వాస్తవమే, కాని ఆయనతో సినిమా చేయడం లేదు. ఏదో సరదాగా కలిశాను అంతే అని అన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు చాలా మంచి వ్యక్తి అని, మంటి సెన్సాఫ్ హ్యూమర్ కల వ్యక్తి అని అన్నారు. ఐతే చివరగా ఏ విషయం లేకపోతే రామ్ గోపాల్ వర్మ గారిని ఈ గోవా బ్యూటీ ఎందుకు కలిసిందా అని అనుకుంటున్నారు.

కొత్తగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపోందుతున్న నేను నా రాక్షసి చిత్రంలో ఇలియానా కధానాయికగా నటిస్తున్న విషయం అందరికి తెలిసందే. ఈ సినిమా లో హీరోగా రాణా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. పోకిరి సినిమాకి ఆయనతో కలిసి పనిచేశాను. మళ్శీ ఇన్నాళ్శకు ఆయనతో కలసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ఇటీవల నా పేరు మీద ఎవరో ఫేస్ బుక్ లో ఎకౌంట్ ఓపెన్ చేశారు. అదినేను కాదు, ఆ ఎకౌంట్ ని నమ్మకండంటూ తన అభిప్రాయాలను వెల్లడించారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu