»   »  చైతూదీ నాదీ దేవుడి ప్రేమ : సమంతా

చైతూదీ నాదీ దేవుడి ప్రేమ : సమంతా

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగ చైతన్య, సమంత త్వరలో భార్య భర్తలు కాబోతున్న సంగతి తెలిసిందే.నాగ చైతన్య, సమంత.... కలిసి నటించిన తొలి సినిమా 'ఏమాయ చేసావె'తోనే జోడీ అదిరింది అనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్బ్. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన 'ఆటో నగర్ సూర్య', 'మనం' చిత్రాల్లోనే చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు.నాగచైతన్య, సమంత గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే ఎవరికీ తెలియకుండా చాలా కాలం పాటు సీక్రెట్ గా రిలేషన్ షిప్ నడిపించారు. ఈ జంటకు నిశ్చితార్థం అయింది కాబట్టి సగం పెళ్లి అయినట్లే. ప్రస్తుతం ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఎవరి సినిమాల్లో వారి బిజీగా ఉంటూనే ఇద్దరికీ సమయం దొరికినప్పుడల్లా ఫ్రెండ్స్, పార్టీల్లో మునిగి తేలుతూ ఎంజాయ్ చేస్తున్నారు....

ఇద్దరూ బిజీగానే ఉన్నారు

ఇద్దరూ బిజీగానే ఉన్నారు

అయితే ఇప్పటికైతే సినిమాల్లో ఇద్దరూ బిజీగానే ఉన్నారు. అయినా ఇద్దరి మధ్యా ఉన్న అనుబందానికి మాత్రం ఏ లోపమూ రాకుండా చూసుకుంటూనే ఒకరి మీద ఒకరు ప్రేమకురిపిస్తూనే ఉన్నారు. ఈ మధ్యే సమంతా మాట్లాడుతూ. నటన ఎన్నడూ నా వ్యక్తిగత జీవితాన్ని బాధించలేదని, సినిమాలో చెప్పే డైలాగులు వేరు నిజజీవితం వేరని చెప్తూ..

మా ఇద్దరిదీ దేవుడు కలిపిన ప్రేమ

మా ఇద్దరిదీ దేవుడు కలిపిన ప్రేమ

సినిమా మీద ఉన్న ప్రేమ ఒకటైతే చైతూ కీ నాకు మధ్య ఉన్న ప్రేమ ఇంకోరకం మా ఇద్దరిదీ దేవుడు కలిపిన ప్రేమ అనేసింది, నాగచైతన్య ఒక చిత్రంలో స్త్రీలు మగవారి మనశ్శాంతికి హాని కలిగిస్తారనే డైలాగులు చెప్పడం వివాదాస్పదమైన నేపధ్యంలో సమంత ఇప్పటికే క్లారిటీ ఇచ్చి మరీ అది నన్ను ఉద్దేశించి అన్నది కాదులే అని కొట్టి పడేసింది.

అందుకే సినిమా మీద అంత ప్రేమ

అందుకే సినిమా మీద అంత ప్రేమ

సినిమాకు తనకు మంచి బంధం ఉందనీ అది తనకు చాలా సంతృప్తినిచ్చిందనీ... సినిమాలో కష్టాలు ఎదురైనా వాటిని మరపించేంత సంతోషాన్ని సినిమా తనకు అందించిందని అందుకే నాకు సినిమా మీద అంత ప్రేమ ఉందంటూ చెప్పింది. డబ్బుకోసమే, పేరు కోసమో తాను నటించడం లేదని, దానిపై ప్రేమ ఏమాత్రం తగ్గకపోవడం కారణంగానే నటనలో కొనసాగుతోందట.

సావిత్రి జీవిత చరిత్ర

సావిత్రి జీవిత చరిత్ర

ప్రస్తుతం తమిళంలో విజయ్‌కు జంటగా ఒక చిత్రంతో పాటు మరో చిత్రం చేస్తున్నానని, అదే విధంగా మహానటి సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నాని చెప్పింది సమంతా... ఇన్నీ చెప్పిన సమంతా పెళ్ళి ఎప్పుడన్న విశయం మాత్రం చెప్పలేదు.. ఇలా ప్రేమించుకుంటూ, ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకుంటూ ఇంకెంత కాలం ఉంటారో .

English summary
Actress Samantha said that acting did not hurt my personal life any more. Samantha, who is drowning in love with young actor Nagachaitanya, is getting ready to prepare for him. Even though she is busy with actress, she says that he is the love of God.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu