»   » ‘టెంపర్’ కి తగ్గలేదు, చిరు-బాలయ్యతో పోటీలేదు.., అది దుర్మార్గమే: ఆర్ నారాయణ మూర్తి

‘టెంపర్’ కి తగ్గలేదు, చిరు-బాలయ్యతో పోటీలేదు.., అది దుర్మార్గమే: ఆర్ నారాయణ మూర్తి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద: పీపుల్ స్టార్ ఆర్.నారాయ‌ణమూర్తి, స‌హ‌జ న‌టి జ‌య‌సుధ జంట‌గా న‌టించిన చిత్రం హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామయ్య‌. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలిమ్స్ బ్యాన‌ర్ పై చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించారు. చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి నిర్మించిన హెడ్ కానిస్టేబుల్ చిత్రంసెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల‌వుతుంది.

ఈ సంద‌ర్భంగా శుక్ర‌వారం హైద‌రాబాద్‌ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసన పాత్రికేయుల స‌మావేశంలో చిత్ర యూనిట్ పాల్గొంది. ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ... నాకు ఒక‌ గొప్ప పాత్ర‌ను చేసే అవ‌కాశం ఇచ్చిన చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు గారికి ఈ సంద‌ర్భంగా థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. నేను 30 సంవ‌త్స‌రాలుగా సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్నాను. మా గురించి సినిమా తీయండి అని పోలీసులు అడుగుతుండేవారు. నాకు పోలీసులు అంటే కోపం లేదు. నా కోపం అంతా వ్య‌వ‌స్ధ మీదే అని చెప్పేవాడిని అని అని అన్నారు.

 మాన‌వ విలువ‌ల‌ను ఆర్ధిక విలువ‌లు డామినేట్ చేస్తున్నాయి

మాన‌వ విలువ‌ల‌ను ఆర్ధిక విలువ‌లు డామినేట్ చేస్తున్నాయి

మాన‌వ విలువ‌ల‌ను ఆర్ధిక విలువ‌లు డామినేట్ చేస్తున్నాయి. ఈ ద‌శ‌లో డ‌బ్బు లేకుండానే చేస్తే బాగుంటుంది క‌దా అనే ఆలోచ‌న మా డైరెక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు చెప్పారు. పాయింట్ న‌చ్చ‌డం...దీనికి తోడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు గారితో ఎప్ప‌టి నుంచో అనుబంధం ఉండ‌డం వ‌ల‌న ఈ సినిమా చేసాను. ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నా పై ఇంత ఖ‌ర్చు పెడుతున్నారు ఏమిటి అంటే బ‌డ్జెట్ గురించి మీరు ఆలోచించ‌కండి అనేవారు.... అని ఆర్ నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

 నాకు తొలి సంక్రాంతి

నాకు తొలి సంక్రాంతి

సావిత్రి గారి త‌ర్వాత నేను అభిమానించే హీరోయిన్ స‌హ‌జ న‌టి జ‌య‌సుధ‌. ఎంత‌గానో స‌హ‌క‌రించి ఈ చిత్రంలో న‌టించిన జ‌య‌సుధ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. ఇక సినిమా రిలీజ్ విష‌యానికి వ‌స్తే...ఫ‌స్ట్ టైమ్ నా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని ఆర్ నారాయణ మూర్తి అన్నారు.

 చిరు-బాలయ్యతో పోటీ లేదు

చిరు-బాలయ్యతో పోటీ లేదు

ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న నా సినిమా రిలీజ్ అవుతుంది అంటే...మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న బాల‌కృష్ణ మ‌ధ్య‌లో పీపుల్ స్టార్ అంటున్నారు. వాళ్ల‌తో నాకు పోటీ లేదు. అయితే...నా సినిమాకి ఒక థియేట‌ర్ కూడా దొర‌క‌ని ప‌రిస్థితి. ఒక థియేట‌ర్ కూడా దొర‌క‌డం లేదు అంటే ఏడుపు వ‌స్తుంది అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

 దుర్మార్గం

దుర్మార్గం

కొంత మంది చేతుల్లో థియేట‌ర్స్ ఉండడ‌డం వ‌ల‌న థియేటర్స్ దొరకని ఇలాంటి ప‌రిస్థితి వ‌చ్చింది. చిన్న సినిమాకి ధియేట‌ర్స్ దొర‌కక‌పోవ‌డం అంటే దుర్మార్గం చ‌ర్య‌. చిన్న సినిమాల‌కు థియేట‌ర్స్ ల‌భించేలా చూడాల్సిన బాధ్య‌త ఫిల్మ్ ఛాంబ‌ర్, ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్, గ‌వ‌ర్న‌మెంట్ పై ఉంది. క్రేజ్ ని క్యాష్ చేసుకోవ‌డం కోసం ఒకే సినిమాని అన్ని థియేట‌ర్స్ లో వేస్తున్నారు అని నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

 ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదు

ఇండస్ట్రీ ఏ ఒక్కరిదీ కాదు

చిన్న సినిమాలు పండ‌గలు లేన‌ప్పుడు, పెద్ద సినిమాలు లేన‌ప్పుడు రిలీజ్ చేయాలా..? స‌క్సెస్ ఫెయిల్యూర్ అనేది జ‌నం నిర్ణ‌యిస్తారు. ఇండ‌స్ట్రీ ఏ ఒక్క‌రిదో కాదు.. అంద‌రిది. చిన్న సినిమాల‌కు న్యాయం చేయ‌మ‌ని కోరుతున్నాను అంటూ ఈ సందర్భంగా నారాయణ మూర్తి చెప్పుకొచ్చారు.

 తగ్గడం ఇష్టం లేకే టెంపర్ ఆఫర్ తిరస్కరించాను

తగ్గడం ఇష్టం లేకే టెంపర్ ఆఫర్ తిరస్కరించాను

'టెంపర్'లో హెడ్ కానిస్టేబుల్ పాత్రని పోషించాల్సిందిగా నారాయణ మూర్తిని పూరి రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన అంగీకరించలేదు. దీంతో ఆ పాత్ర పోసాని కృష్ణమురళి చేసారు. దీనిపై ఆర్ నారాయణ మూర్తి స్పందిస్తూ... "జూనియర్ ఆర్టిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టి క్రమక్రమంగా లీడ్ రోల్స్ పోషించే నటుడిగా ఎదిగిన నాకు మళ్లీ వెనక్కి వెళ్లి సపోర్టింగ్ రోల్స్ పోషించాలనే కోరిక లేదు. ఆ ఆఫర్ ఇచ్చింది ఎంత పెద్ద నిర్మాణ సంస్థ అయినా సరే... అటువంటి పాత్రలు పోషించడానికి తాను సిద్ధంగా లేను. అందుకే టెంపర్ మూవీ తిరస్కరించాను" అని అన్నారు.

 పోటీ బాగా ఉంది

పోటీ బాగా ఉంది

చిత్ర ద‌ర్శ‌కుడు చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావు మాట్లాడుతూ - ``నాకు ఊహ తెలిసిన‌ప్ప‌టి నుంచి 50 ఏళ్లుగా సంక్రాంతి పండుగ‌ను చూస్తున్నానాను. ఇండ‌స్ట్రీలో సంక్రాంతి అంటే క్రేజ్ ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఈసారి సంక్రాంతికి చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌ని పోటీ ఏర్ప‌డింది. కోడి పందెల క‌న్నా ఎక్కువు ఆస‌క్తి ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల పై చూపిస్తున్నారు. పోటీ ఉండాలి... పోటీ ఉంటేనే క్వాలిటీ బాగుంటుంది. ఈ సంక్రాంతికి మా సినిమా హెడ్ కానిస్టేబుల్ వెంక‌ట్రామ‌య్య రిలీజ్ అవుతుంది. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సంద‌ర్భంగా సినిమాను జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నాం`` అన్నారు.

English summary
Actor R. Narayanamurthy, Actress Jayasudha starring Head Constable Venkatramaiah release on 14 January.
Please Wait while comments are loading...