తమ చిన్నారులతో మహేష్ బాబును కలిసిన తల్లిదండ్రులు!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'హీల్-ఎ-చైల్డ్' అనే ఆర్గనైజేషన్ ద్వారా అనారోగ్యంతో బాధ పడే చిన్నారుల వైద్యానికి సహాయ పడుతున్న సంగతి తెలిసిందే. అలా మహేష్ బాబు ద్వారా సహాయం పొందిన వారు తమ పిల్లలతో సూపర్ స్టార్‌ను కలిశారు.
క్రిస్మస్ పర్వదినం సందర్భంగా మహేష్ బాబును కలిసి వారంతా.... ఆయనతో కలిసి పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు 'మా పిల్లల కోసం మీరు చేసిన మేలు ఎప్పటికీ మరిచిపోలేము' అంటూ సూపర్ స్టార్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిస్మస్ ముందు రోజు రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ పూర్తయింది. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం యూనిట్ హాలిడే తీసుకున్నట్లు సమాచారం. నెక్ట్స్ షెడ్యూల్ సంక్రాంతి తర్వాత మొదలయ్యే అవకాశం ఉంది.
మహేష్ బాబు కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. అశ్వినీదత్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











