రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు, విచారణ వాయిదా
ఈ కేసులో ప్రతివాదులగా ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సెన్సార్ బోర్డుతో సహా మొత్తం 9 మందికి రాష్ట్ర హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి వచారణ మార్చి 5కి వాయిదా వేసింది. గతంలో న్యాయవాది రాంప్రసాద్ ఈ సినిమాను నిలిపి వేయాలని సెన్సార్ బోర్డును ఆశ్రయించగా, వారు తమ పరిధిలో లేదని చెప్పడంతో హైకోర్టుకెక్కారు.
ముంబై దాడుల గురించి సినిమా తీయడం వల్ల దేశానికి జరిగే మేలు ఏమీ లేదని, పైగా ఈ సినిమా వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటాయని రాంప్రసాద్ ఆందోళన వ్యక్తం చేసారు. దేశ భద్రత వ్యవస్థలోని డొల్లతనాన్ని మనమే బయట పెట్టుకోవడం తప్ప ఈ సినిమాలో మరేమీ లేదని అన్నారు.
ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వడం సినిమాటోగ్రఫీ చట్టం - 1952తో పాటు రాజ్యాంగంలోని అర్టికల్ 14, 19, 21 వ్యతిరేకమని తెలిపారు. అయితే దర్శకుడు వర్మ వాదన మాత్రం వేరేలా ఉంది. ముంబైలో జరిగిన దాడి యావత్ దేశాన్ని వణికించింది. ఘటన జరిగిన తర్వాత అక్కడేం జరిగిందనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతగా కొన్ని నిజాల్ని సినిమా ద్వారా చూపించిన ప్రయత్నం చేస్తున్నామనేది వర్మ వాదన.
మార్చి 1న ఈ సినిమా విడుదల కాబోతోంది. అలుంబ్రా ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈచిత్రంలో సంజీవ్ జైస్వాల్ అనే నటుడు తీవ్రవాది కసబ్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ నటుడు నానా పాటేకర్ ముంబై నటర పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications












