ఫస్ట్ వీక్: బాక్సాఫీసులో ‘హార్ట్ ఎటాక్’ పరిస్థితేంటి?
హైదరాబాద్: నితిన్, ఆదా శర్మ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ ఎటాక్ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలివారం ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్ల రాబట్టింది. ఏపీతో పాటు రెస్టాఫ్ ఇండియాలో సూపర్ కలెక్షన్స్ సాధించింది. అయితే ఓవర్సీస్ మార్కెట్ వద్ద మాత్రం ఈచిత్రం 'పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం కంటే వెనకే ఉంది.
జనవరి 31న 'హార్ట్ ఎటాక్' చిత్రం రికార్డు సంఖ్య థియేటర్లలో విడుదలైనంది. విడుదలైన తొలి రోజు నుండే ఈచిత్రానికి మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా ఈచిత్రం యూత్ ను బాగా ఆకర్షించడంతో మౌత్ టాక్ బాగా స్ర్పెడ్ అయింది. దీంతో తొలి వారం పూర్తయ్యే సమయానికి ఈచిత్రం వరల్డ్ వైడ్ బాక్సాఫీసు వద్ద రూ. 15 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది.
నితిన్, ఆదా శర్మ హీరో హీరోయిన్లుగా పూరి జగన్నాథ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రం దాదాపు రూ. 14 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. విడుదలకు ముందే ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ తో కలిసి రూ. 21 కోట్ల బిజినెస్ చేసింది. విడుదల తర్వాత కూడా సినిమా పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉండటంతో దర్శక నిర్మాతలు, పంపీణీ దారులు హ్యాపీగా ఉన్నారు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి వరుస హిట్ల తర్వాత ఈ చిత్రంతో నితిన్ హాట్రిక్ కొట్టాడు.


Click it and Unblock the Notifications












