నితిన్ 'హార్డ్‌ఎటాక్' స్టోరీ లైన్
హైదరాబాద్ : నితిన్ హీరోగా రూపొందిన చిత్రం 'హార్డ్‌ఎటాక్'. అదాశర్మ హీరోయిన్. పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం పూరీ స్వయంగా తన బ్యానర్ పై తీయటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఆడియో రీసెంట్ గా బ్యాంకాక్ లో విడుదలైంది.
చిత్రంలో నితిన్ పేరు వరుణ్. అతను చేసే పని... దేశాలు పట్టుకు తిరగడం.. అదేనండి ట్రావెలర్. ఆయా దేశాల్లో ప్రకృతి అందాలు చూసి మురిపోతున్న వాడికి ఓ అమ్మాయి కనిపించింది. పేరు హయాతి. అందమంటే ఇదీ అనిపించేలా ఉంది ఆ అమ్మాయి. ఇంకేముంది ఆ అమ్మాయి వెంట పడ్డాడు. అయితే అది ప్రేమ కోసం కాదు... ముద్దు కోసం. అతడికి తెలియని విషయమేమిటంటే ఆ అమ్మాయి వాణ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తుందని. మరి ఈ కథేమైంది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు.

పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ''సినిమాకి అనూప్ అందించిన సంగీతం ప్రధానాకర్షణ. 'ఇడియట్' సమయంలోనే ఇద్దరం కలసి పనిచేయాల్సింది. అయితే ఇప్పటికి కుదిరింది. నా నుంచి చాలా రోజులతర్వాత వస్తున్న ప్రేమకథా చిత్రమిది. భాస్కరభట్ల అందించిన పాటలు సినిమాకి కొత్తఅందాన్నిచ్చాయి''అన్నారు.
పూరి జగన్నాథ్‌తో ఓ మంచి సినిమా చెయ్యాలన్న నా కోరిక ''హార్ట్ ఎటాక్''తో నెరవేరుతోంది. నాకు ''హార్ట్ ఎటాక్'' సినిమా చాలా టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకం వుంది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. కామెడీ, రొమాన్స్, లవ్, మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయి. సినిమా సూపర్‌గా నచ్చింది. గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది. అనూప్ మంచి సంగీతం అదించారు. భారస్కర భట్ల లిరిక్స్ బాగున్నాయి.' అన్నారు.
నితిన్ సరసన అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: భాస్కరభట్ల, సినిమాటోగ్రఫి అమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సమర్పణ: లావణ్య, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - నిర్మాత - దర్శకత్వం - పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











