నితిన్‌తో లవ్‌లో ఉన్నానంటున్న పూరి (ఫోటోలు)
హైదరాబాద్: యూత్‌స్టార్ నితిన్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై లావణ్య సమర్పణలో రూపొందిస్తున్న చిత్రం 'హార్ట్ ఎటాక్'. ఈ చిత్రం ఆడియో ఇటీవల బ్యాంకాక్‌లో విడుదల చేసారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసారు.
ఈ సందర్భంగా దర్శకుడు పూరి జగన్నాథ్ మాట్లాడుతూ....'నేనిప్పుడు నితిన్‌తో లవ్‌లో ఉన్నాను. ఈ సినిమాలో నితిన్ నటన చూసిన ప్రతి ఒక్కరు ఆయన లవ్‌లో పడతారు. అంతా బాగా నటించాడు. . నితిన్‌కి ఇది చాలా పెద్ద హిట్ సినిమా అవుతుంది. నాకెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్‌లో సినిమా వచ్చింది' అన్నారు.
స్లైడ్ షోలో సినిమా 'హార్ట్ ఎటాక్' ప్రెస్ మీట్‌కు సంబంధించిన ఫోటోలు, మరిన్ని వివరాలు...

ఆడియో హిట్
పూరి మాట్లాడుతూ...‘అనూప్ మ్యూజిక్ చాలా బాగా చేశాడు. ఆరు పాటలూ సూపర్‌హిట్ అవుతాయి. గతంలో ఇడియట్ సమయంలోనే అనూప్‌తో సినిమా చేయాల్సి ఉంది. అప్పుడు అడిగితే తాను ఇంకా నేర్చుకోవాల్సి ఉందని అన్నాడు. ఇపుడు ఇచ్చిన ఛాన్సును ఎంతో బాగా ఉపయోగించుకున్నాడు' అని అన్నాడు.

అనూప్ రూబెన్స్
సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ....పూరి దర్శకత్వంలో బుడ్డా హోగా తెరా బాప్, నేను నా రాక్షసి సినిమాలకు సంగీతం అందించాను. నితిన్‌తో చేయడం ఇది మూడో సారి. పాటలు అందరినీ అలరిస్తాయని ఆశిస్తున్నాను అన్నారు.

నితిన్ మాట్లాడుతూ...
పూరి జగన్నాథ్‌తో ఓ మంచి సినిమా చెయ్యాలన్న నా కోరిక ''హార్ట్ ఎటాక్''తో నెరవేరుతోంది. నాకు ''హార్ట్ ఎటాక్'' సినిమా చాలా టర్నింగ్ పాయింట్ అవుతుందన్న నమ్మకం వుంది. ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ. కామెడీ, రొమాన్స్, లవ్, మ్యూజిక్ అన్నీ బాగా కుదిరాయి. సినిమా సూపర్‌గా నచ్చింది. గ్యారెంటీగా పెద్ద హిట్ అవుతుంది. అనూప్ మంచి సంగీతం అదించారు. భారస్కర భట్ల లిరిక్స్ బాగున్నాయి.' అన్నారు.

హార్ట్ ఎటాక్
నితిన్ సరసన అదా శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, పాటలు: భాస్కరభట్ల, సినిమాటోగ్రఫి అమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్‌లక్ష్మణ్, సమర్పణ: లావణ్య, కథ - స్క్రీన్‌ప్లే - మాటలు - నిర్మాత - దర్శకత్వం - పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











