»   » ఇక హైదరాబాద్‌లో ‘హార్ట్‌ఎటాక్’

ఇక హైదరాబాద్‌లో ‘హార్ట్‌ఎటాక్’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : యంగ్ హీరో నితిన్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో 'హార్ట్ ఎటాక్' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ డిఫరెంటు లుక్ తో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈచిత్రం చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఇటీవలే చిత్ర యూనిట్ సభ్యులు యూరఫ్‌లో లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరిగొచ్చారు.

సినిమాలోని ఎక్కువ భాగం యూరఫ్‌లోనే చిత్రీకరించారు. ప్రస్తుతం మిగిలిన భాగాన్ని హైదరాబాద్‌లో చిత్రీకరించేందుకు ఈ రోజు షూటింగ్ మొదలు పెట్టారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఆదా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. వైష్ణో అకాడమీ పతాకంపై స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రాన్ని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు.

స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈచిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పూరి దర్శకత్వం కావడంతో నితిన్‌ను మరో మెట్టు పైకి తీసుకెళ్లే విధంగా సినిమా ఉండనుందని స్పష్టం అవుతోంది. సాధారణంగా పూరి సినిమాలోని హీరోలకు అమ్మాయిలను ఆటపట్టించే బిహేవియర్ ఉంటుంది. రోమియోలుగా, జులాయిగా కనిస్తారు. ఈ చిత్రంలో నితిన్ లుక్ చూస్తుంటే కూడా అలానే అనిపిస్తోంది.

నితిన్ ఈ సినిమాపై ఎంతో సంతోషంగా, నమ్మకంగా ఉన్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలనే కోరిక ఎప్పటి నుండో ఉంది. ఇప్పటికి ఆ కోరిక నెరవేరబోతోంది. పూరిగారు కథ చెప్పగానే ఎప్పుడెప్పుడు ఈ షూటింగ్ మొదలవుతుందా అని ఆసక్తి నాలో మొదలైంది. ఈ సినిమా నా కెరీర్‌కు ఎంత ముఖ్యమైనదిగా భావిస్తున్నానని అంటున్నాడు నితిన్. మాస్‌, క్లాస్‌ అంశాలు మేళవించిన ప్రేమ కథ ఇది. నితిన్‌ గెటప్‌, ఆయన పాత్ర చిత్రణ ఆకట్టుకొంటాయి. స్పెయిన్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు ఆకర్షణగా నిలుస్తాయి. అనూప్‌ రూబెన్స్‌ అందించిన పాటలు యువతరాన్ని అలరించే విధంగా ఉండనున్నాయి.

English summary
Young hero Nithiin’s ‘Heart Attack’ is in the final stages of completion. A major portion of the film was shot in the European country and the remaining parts of the film will be shot here in Hyderabad. This new schedule has started today in Hyd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu