జెనీలియా నిండు గర్భిణి, త్వరలో డెలివరీ (ఫోటోస్)
హైదరాబాద్: హీరోయిన్ జెనీలియా గర్భవతైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నిండు గర్భణి. మరి కొన్ని రోజుల్లో ఆమె ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇటీవల సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఖాన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు నిండు గర్భిణిగా ఉన్న జెనీలియా తన భర్త రితేష్ దేశ్ ముఖ్‌తో కలిసి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె మీడియా దృష్టిని ఆకర్షించింది.
మాతృత్వపు మధురానుభూతిని పొందబోతున్న జెనీలియా....అర్పితా ఖాన్ పెళ్లి వేడుకలో ఎంతో సంతోషంగా కనిపించింది. భర్త రితేష్ దేశ్ ముఖ్ ఆమెను ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి పెళ్లి వేడుకకు తీసుకొచ్చారు. అమ్మా నాన్నలం కాబోతున్నామనే సంతోషం వారిద్దరి ముఖాల్లో వెల్లువిరిసింది.
స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...

జెనీలియా
సౌతిండియాలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన జెనీలియాకు ఇక్కడ చాలా మంది అభిమానులు ఉన్నారు. పలువురు ఆమెకు బెస్ట్ విషెస్ చెబుతున్నారు.

ప్రేమ వివాహం
రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా మధ్య పెళ్లికి ముందు నుండే చాలా కాలంగా ప్రేమాయణం సాగుతోంది. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘తుజే మేరీ కసమ్' నుండే ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది.

పెళ్లి
రితేస్ దేశ్ ముఖ్, జెనీలియా డిజౌజా మధ్య దాదాపు పదేళ్ల పాటు ప్రేమాయణం సాగింది. ఇద్దరూ 2012లో పెళ్లి చేసుకున్నారు.

సినిమాలకు దూరం
సినిమాలకు దూరం పెళ్లయిన తర్వాత జెనీలియా పూర్తిగా సౌత్ సినిమాలకు దూరం అయింది. ముంబైలోనే ఆమె బిజీబిజీగా గడుపుతున్నారు.


Click it and Unblock the Notifications











