రేట్లు పెంచినా ఆమె డేట్లు హాట్
తెలుగులో హన్సిక హవా బాగా నడుస్తోంది. రేట్లు పెంచేసినా సరే, హన్సిక డేట్లు దొరికితే చాలంటూ నిర్మాతలు ఎగబడుతున్నారు. చెప్పదగిన హిట్లు పెద్దగా లేకపోయినా అందాల ఆరబోతకు అభ్యంతరం చెప్పని ఈ ముద్దుగుమ్మ అగ్రస్ధాయికి చేరిపోయింది. యువజనంలో గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంది. భాష రాకపోయినా హావభావాలను చక్కగా పలికించడం, దర్శకులు చెప్పినదానికంటే రెట్టింపు హొయలు కురిపించడం ఈమె ప్రత్యేకత. అదే విజయ రహస్యం. కుర్రకారు కలల రాణి అయిన ఈమెను కుర్ర హీరోల సరసన బుక చేసేందుకు నిర్మాతలు ఎగబడడంతో రెమ్యూనరేషన్ ను బాగా పెంచేసిందట. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడమంటే ఇదే. కొందరు హీరోయిన్లు బాలీవుడ్ లో బిజీగా ఉండిపోయి తెలుగు నిర్మాతలకు కాల్షీట్లు ఇవ్వకపోవడంతో హైదరాబాద్ లోనే ఉంటున్న హన్సికకు డిమాండ్ ఏర్పడింది.
hansika bollywood hyderabad billa maska prabhas ram meher ramesh హన్సిక నిర్మాతలు హైదరాబాద్ బాలీవుడ్


Click it and Unblock the Notifications