యవగర్జన సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎన్టీఆర్ ..డాక్యు డ్రామా సిడి కు అన్ని చోట్ల నుండి హెవి డిమాండ్ వస్తున్నట్లు సమాచారం. కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో రూపొందించిన ఈ సిడిలో తెలుగు దేసం పార్టీ అధ్యక్షుడు నందమూరి తారక రామారావు నట జీవితం ఆయన రాజకీయ జీవితంపై ఆయన చేసిన సినిమాల ప్రభావం,అలాగే ఆయన భావాలు సైతం అప్పటి సినిమా పాత్రల్లో ప్రతిబింబించటం క్లిప్పులతో వివరిస్తూ విడుదల చేసారు. ఇక దానికి చంద్రబాబు వాయిస్ ఓవర్ అందించారు. అయితే ఈ సిడిని కొనాలనుకుంటున్నారు..తెలుగు దేశం పార్టీ వాసులు కాకుండా ఎన్టీఆర్ అభిమానులు కావటం విశేషం. వారు దీన్ని తమ కలెక్షన్స్ లో ఒకటిగా చేర్చుకోవాలనుకుంటున్నారు. దాంతో పార్టీ వారినే కాక ఆ సిడి క్లిప్పింగ్ లను ప్రసారం చేసిన ఛానెల్ వారిని సైతం అభిమానులు అడుగుతున్నారని సమాచారం. ఆ మహానటుడు మీద తీసిన ఆ సీడిని తమ ఇంటిలో ఉండటాన్ని వారు ఇష్టపడుతున్నారు.