హైదరాబాద్: పార్టీ పదవులు ప్రకటించినప్పుడు పీఆర్పీలో రేగిన నిరసన జ్వాలలు దృష్టిలో ఉంచుకుని ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. టిక్కెట్లు కేటాయించాక ఎదురయ్యే ఆగ్రహాన్ని ముందే వూహించి సమాయత్తమవుతోంది. కేటాయింపుల్లో కీలకపాత్ర పోషిస్తున్న అల్లు అరవింద్‌కు చెందిన గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద అద్దాలన్నిటికి రక్షణగా ఫ్త్లెవుడ్ చెక్కలను బిగించారు. భద్రతను పెంచారు. ప్రజారాజ్యం రెండు ఆఫీసుల వద్ద కూడా ఇటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు.
Story first published: Monday, March 23, 2009, 16:24 [IST]