అల్లు అర్జున్ సిన్మాకు భారీ సెట్
అల్లు అర్జున్ కథానాయకుడిగా గుణశేఖర్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్న చిత్రానికి సంబంధించిన ఆఖరి షెడ్యూల్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో సాగుతోంది. నిర్మాత మాట్లాడుతూ కళా దర్శకుడు అశోక్ సారథ్యంలో భారీ సెట్‌ను వేశాం. ఆదివారం నుంచి ఈ నెలాఖరు వరకు దాదాపు 25 రోజులు ఈ షెడ్యూల్ సాగుతుంది. దీంతో సినిమా మొత్తం పూర్తవుతుంది. దేశముదురు తర్వాత మా సంస్థలో బన్ని నటిస్తున్న చిత్రమిది. గుణశేఖర్, బన్ని కలిసి చేస్తున్న తొలి చిత్రం. అత్యున్నత సాంకేతిక విలువలను పాటిస్తూ రూపొందిస్తున్నాం. అందరి అంచనాలకు చేరువవుతామని పేర్కొన్నారు.
ఈ చిత్రం ద్వారా కథానాయికగా నూతన నటి పరిచయమవుతోంది. తమిళ నటుడు ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. సుహాసిని, నరేష్, ఆశిష్ విద్యార్థి, సాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్ తదితరులు ఇతర పాత్రధారులు. సంగీతం: మణిశర్మ, కెమెరా: ఆర్.డి.రాజశేఖర్, ఫైట్స్: స్టన్‌శివ, కళ: అశోక్, కూర్పు: ఆంథోని.


Click it and Unblock the Notifications











