For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

24 కిస్సెస్ ట్రైలర్: లిప్ కిస్సులతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్, ఇంత ఘూటుగానా.. కామి కాని వాడు అంటూ!

|
24 కిస్సెస్ ట్రైలర్: లిప్ కిస్సులతో రెచ్చిపోయిన హెబ్బా పటేల్

యంగ్ బ్యూటీ హెబ్బా పటేల్ కుమారి 21 ఎఫ్ చిత్రంతో టాలీవుడ్ లో సంచలనంగా మారిపోయింది. యువతలో ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తరువాత కొన్ని హిట్స్ పడ్డాయి. చిన్న చిత్రాలతో హెబ్బా జోరు పెంచింది. మధ్యలో పరాజయాలు కూడా ఎదురవడంతో స్టార్ హీరోయిన్ కాలేక పోయింది. బోల్డ్ రోల్స్ కు తాను వెనుకాడనని తన చిత్రాల ద్వారా ఈ భామ చెబుతూనే ఉంది. తాజగా హెబ్బా పటేల్ నటిస్తున్న చిత్రం 24 కిస్సెస్. టైటిల్ తోనే యువతని ఆకర్షించేలా ఉన్న ఈ చిత్రంలో హెబ్బా, యువ నటుడు ఆదిత్ జంటగా నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితమే ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.

రొమాంటిక్ లవ్ స్టోరీ

రొమాంటిక్ లవ్ స్టోరీ

ట్రైలర్ చూస్తుంటే 24 కిస్సెస్ చిత్రాన్ని లవ్ అండ్ రొమాంటిక్ అంశాలతో రూపొందించినట్లు తెలుస్తోంది. ఆదిత్, హెబ్బా పటేల్ మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ చిత్రంలో సీనియర్ నటుడు రావు రమేష్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

రెచ్చిపోయిన హెబ్బా

ట్రైలర్ లో ఆదిత్, హెబ్బా పటేల్ మధ్య ఘాటు లిప్ లాక్ సన్నివేశాల్ని చూపించారు. ఇద్దరూ రెచ్చిపోయి నటించారు. యువతని ఆకర్షించేలా రొమాంటిక్ సీన్స్ రూపొందించినట్లు తెలుస్తోంది.

ఎమోషనల్ డ్రామా

ఎమోషనల్ డ్రామా

హీరో, హీరోయిన్ ప్రేమ కథలో ఎమోషనల్ అంశాలు కూడా ఉన్నాయి. ఏదో కారణం వలన ఇద్దరూ విడిపోయే సన్నివేశాలని చాలా ఎమోషనల్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. హీరో ప్రేమ కథ ఎలా మొదలైంది. లీడ్ మధ్యలో వచ్చిన ఆ లేడి ఎవరు వంటి ఆసక్తికర అంశాలతో ట్రైలర్ రూపొందించారు.

 కామి కాని వాడు

కామి కాని వాడు

ఈ మొత్తం కథని రావు రమేష్ కు హీరో ఆదిత్ వివరిస్తుంటాడు. రావు రమేష్ డైలాగులు హాస్యాన్ని పండించే విధంగా ఉన్నాయి. 'కామి కాని వాడు మోక్షగామి కాడు అని' ఆదిత్ ఫన్నీ డైలాగ్స్ చెబుతున్నాడు. అద్వైతాన్ని అర్థం చేసుకోవచ్చు కానీ ఆడదాన్ని అర్థం చేసుకోలేవు సుబ్బారావు .. ఎస్వీఆర్ గారు అన్నారు అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తోంది.

అయోధ్య కుమార్

అయోధ్య కుమార్

ఈ రొమాంటిక్ లవ్ డ్రామాని దర్శకుడు అయోధ్యకుమార్ తెరకెక్కించారు. రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని సంజయ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary
Hebah Patel 24 Kisses movie trailer released. Hebah Patel and Adith Arun are lead pair
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more