»   »  హాట్‌ అండ్‌ సెక్సీ అనిపించుకోవాలనే... హెబ్బాపటేల్ (హాట్ ఫొటో షూట్)

హాట్‌ అండ్‌ సెక్సీ అనిపించుకోవాలనే... హెబ్బాపటేల్ (హాట్ ఫొటో షూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాలు సక్సెస్‌ అయినా అనుకున్న గుర్తింపు రాలేదనే విషయం ఒక్కటే నాకు ఎప్పటికీ అర్థం కాని పజిల్‌! నా సినిమాలేవీ డిజాస్టర్‌ కావు. బాగానే ఆడతాయి. ఎక్స్‌పోజింగ్‌కి నేనేమీ వ్యతిరేకిని కాను. ఎంత బోల్డ్‌గా కనిపించమన్నా అభ్యంతరం పెట్టను.

కానీ నన్ను ఇంకా చిన్నపిల్లగానే చూస్తున్నారు తప్ప నాలోని గ్లామర్‌ని చూడడం లేదు. నన్ను హాట్‌ అండ్‌ సెక్సీ అని అంటేనే చాలా ఇష్టం. కానీ నా మొహం ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుందని అంటూంటారు. ఇక నటన పరంగా కూడా మంచి మార్కులే పడుతున్నాయి. 'అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని' అన్న చందంగా తయారైంది నా పరిస్థితి అంటోంది హెబ్బా బాధపడుతూ..

కుమారి 21 ఎఫ్ సినిమాతో తన అందం, నటన, యాటిట్యూడ్‌తో మన యూత్ కు పిచ్చపిచ్చగా నచ్చిన, మెచ్చిన హీరోయిన్ గా మారి పోయింది హెబ్బా పటేల్. దాంతో ఆమెకు వరుస అవకాశాలు వెల్లువెత్తుతాయి అనుకుంది. అయితే అరకొర ఆఫర్సే ఆమెను వరిస్తున్నాయి. . ఆ సినిమాతో హెబ్బా స్థాయి ఓ రేంజ్‌లో పెరుగుతుందని అనుకున్నారు. అందరూ ఊహించిన విధంగా ఆమె కెరీర్‌ స్పీడందుకోలేదు.

రీసెంట్ గా ఆమె మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో రూపొందిన ఆడో రకం..ఈడో రకం సినిమాలో చేసింది. ఆ సినిమా కూడా మంచి హిట్టైంది. దాంతో ఇప్పుడు ఆమె తన ప్రస్దానాన్ని పెద్ద బ్యానర్స్ వైపు పెట్టుకుంది. అందులో బాగంగా ఆమె హాట్ ఫొటో షూట్ కు దిగింది. ఇదిగో ఇలా తన అందాలతో రెచ్చగొడతోంది.

రెడ్ మ్యాగజైన్ కవర్ పైనా, యు అండ్ ఐ మ్యాగజైన్ కవర్ పేజీ పైనా తన అందాలను ఆరబోసింది. మే నెలలో వచ్చిన ఈ రెండు మ్యాగజైన్ కవర్ పేజీలపై కళ్లు తిప్పుకోనివ్వని అందాలతో అదరకొడుతోంది. ఈ కవర్ పేజీలు చూసిన వారు ..ఏంటి కుమారి 21 ఎప్ ఎమ్ లో చేసిన హెబ్బా యేనా అని అడుగుతున్నారు. మరి మీరు కూడా ఓ లుక్కేయండి మరి...

స్లైడ్ షోలో ..అందాల ఆరబోతతో పాటు ఆమె ఇంటర్వూ చూడండి..

పెద్ద హిట్

పెద్ద హిట్

‘ఈడోరకం ఆడోరకం' సినిమా కామెడీగా చాలా బాగుందని చూసిన వాళ్ళు చెబుతుంటే చాలా ఆనందమనిపిస్తోంది. సినిమా బాగుంటే తప్పకుండా ఆదరిస్తారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ‘కుమారి 21 ఎఫ్‌' ఎంత పెద్ద హిట్టో ‘ఈడోరకం ఆడోరకం' కూడా అంత పెద్ద హిట్‌.

రెండో సారి కూడా

రెండో సారి కూడా

రాజ్‌తరుణ్‌తో రెండోసారి చేయడం గురించి చెప్పాలంటే.. తను చాలా ఎనర్జెటిక్‌గా ఉంటాడు. తనతో చేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. ‘కుమారి' సినిమా సమయంలోనే ఆ విషయం నాకు అర్థమైపోయింది. మా కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది.

కారణం కాదేమో..

కారణం కాదేమో..

అవకాశాలు రాకపోవడానికి కుటుంబ నేపథ్యమే కారణం కాదేమో.. మా కుటుంబంలో ఎవరూ ఈ రంగంలో లేరన్నది నిజమే! అయితే సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ ఉన్న వారందరూ సక్సెస్‌ కావడం లేదు కదా! అవకాశాలు రావడానికి బ్యాక్‌గ్రౌండ్‌ కొంత వరకే ఉపయోగపడుతుంది, అంతే. టాలెంట్‌ లేకపోతే ఎన్ని రికమెండేషన్లు ఉన్నా అవకాశాలు రావు. ఇదే నేను గమనించిన విషయం.

పేరెంట్స్ కు ఇష్టం లేదు

పేరెంట్స్ కు ఇష్టం లేదుచదువు మధ్యలో ఆపి సినిమాలు చేస్తానంటే వద్దని అన్నారు. ఈ రంగం గురించి వారికి పూర్తిగా తెలియదు. రిజల్ట్‌ అటూ ఇటూగా వస్తే ఇబ్బంది అవుతుంది. చేతిలో గ్రాడ్యుయేషన్‌ సర్టిఫికెట్‌ ఉంటే, ఇక్కడ సక్సెస్‌ కాలేకపోతే మరో రంగంలో సెటిల్‌ కావచ్చన్నది వారి ఉద్దేశం. అందుకే నా మొదటి సినిమా ‘అలా ఎలా'లో అవకాశం వచ్చినప్పుడు కొంత అయిష్టత కనబరిచారు.

భయాలు పోయాయి.

భయాలు పోయాయి.

ఇప్పుడు నా సినిమాల సక్సెస్‌ చూసి నా కెరీర్‌ మీద వారిలో ఉన్న భయాలన్నీ పోయాయి.

‘కుమారి 21ఎఫ్‌' కన్నడ రీమేక్ లో ..

‘కుమారి 21ఎఫ్‌' కన్నడ రీమేక్ లో ..

ఈ సినిమాను కన్నడంలో చేయబోతున్నారన్న విషయం నాకూ తెలిసింది. అయితే కన్నడంలో చేయమని ఇంత వరకూ నన్ను ఎవరూ అప్రోచ్‌ కాలేదు. అడిగితే తప్పకుండా చేస్తాను. కన్నడంలో నా మొదటి సినిమా ఫ్లాప్‌ కావడంతో అక్కడ నాకు హిట్‌ అన్నది లేదు. ఈ సినిమాలో నాకు అవకాశం వస్తే కన్నడంలో కూడా ఓ హిట్‌ను తప్పకుండా నా ఖాతాలో వేసుకుంటాను.

తెలుగులో చేస్తున్న సినిమాలు?

తెలుగులో చేస్తున్న సినిమాలు?

శర్వానంద్‌ హీరోగా ఒక సినిమా అంగీకరించాను. మరో రెండు కథలు వినడం జరిగింది. వాటికి ఇంకా ఓకే చెప్పలేదు.

English summary
Hebah Patel, though made a unnoticeable début with Ala Ela , she shot up to be this 'overnight star' with her sensational second film, Kumari 21 F. The actress was seen adoring the covers of Red Magazine and You & I Magazine, for the month of May.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu