హెబ్బా పటేల్, అరుణ్ అదిత్... ‘24 కిస్సెస్’ (ఫస్ట్ లుక్)
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న '24 కిస్సెస్' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే(జులై 6) సందర్భంగా గురువారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ జులై 7న విడుదల చేయబోతున్నారు.
'మిణుగురులు' లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తీసి తొలి చిత్రంతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అయోధ్యకుమార్ '24 కిస్సెస్' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మూవీ టైటిల్‌తో పాటు 'నీకో సగం.. నాకో సగం.. ఈ ఉత్సవం' అంటూ పెట్టిన ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచే విధంగా ఉంది.

ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా ఉండబోతోందని, ఒక బోల్డ్ మూవీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సిల్లీమంక్స్ ఎంటర్టెన్మెంట్స్ & రెస్పెక్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.
నటీనటులు: హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరష్ తదితరులు.
దర్శకత్వం: అయోధ్య కుమార్
నిర్మాతలు: సంజయ్ రెడ్డి, అనిల్ పల్లల, అయోధ్యకుమార్
లైన్ ప్రొడ్యూసర్: గిరిధర్ మామిడిపల్లి
సినిమాటోగ్రఫీ: ఉదయ్ గుర్రాల
సంగీతం: జోయి బారువా
ఎడిటర్: ఆలయం అనిల్
రచన: అయోధ్యకుమార్, హరి శంకర్
లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి
ఆర్డ్ : హరి వర్మ
కో డైరెక్టర్: శ్రవణ్ కుమార్


Click it and Unblock the Notifications











