ఒకటి కాదు.. రెండు కాదు.. '24'ముద్దులు, హెబ్బా పటేల్ రెచ్చిపోతుందట?
Recommended Video

తన సినిమాలన్నీ వరుసగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన హెబ్బా పటేల్‌కు మాత్రం అవకాశాలు తగ్గడం లేదు. కుమారి 21ఎఫ్,ఎక్కడికి పోతావు చిన్నవాడా మినహాయిస్తే.. ఆమె నటించిన ఆడోరకం ఈడోరకం, 'నాన్న నేను నా బోయ్ ఫ్రెండ్స్', 'ఏంజెల్' సినిమాలు ఫ్లాప్స్ మూటగట్టుకున్నాయి. అయినా హెబ్బా చేతిలో మరో సినిమా వచ్చి పడింది.

శ్రీ లక్ష్మీ అండ్ 24 కిసెస్:
'మిణుగురులు' సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నయోధ్య కుమార్ దర్శకత్వంలో 'శ్రీ లక్ష్మీ అండ్ 24 కిసెస్' అనే ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం తాజాగా హెబ్బా పటేల్ ను ఓకె చేశారు.

మరోసారి బోల్డ్ క్యారెక్టర్:
'శ్రీలక్ష్మీ&24కిసెస్' సినిమాలో అవకాశంపై హెబ్బా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 'కుమారి 21 ఎఫ్... తరహాలోనే '24 కిసెస్'లో కూడా నాది చాలా బోల్డ్ క్యారెక్టర్. ఆ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో, దీనికి కూడా అంతే క్రేజ్ వస్తుంది' అని హెబ్బా ధీమాగా చెబుతోంది.

గ్లామర్ డోసు పెంచుతారా?:
'శ్రీలక్ష్మీ&24కిసెస్'లో బోల్డ్ సన్నివేశాలు పీక్ స్టేజ్ లో ఉంటాయన్న టాక్ వినిపిస్తోంది. హెబ్బా గ్లామర్ ను పూర్తిగా వినియోగించుకునేలా ఘాటైన సన్నివేశాలు ఉంటాయట. అయితే మరీ ఘాటు ఎక్కువైతే సెన్సార్ వాళ్లు అభ్యంతరం చెప్పరా? అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి.

'కుమారి 21ఎఫ్'లో:
21ఎఫ్ సినిమాలో మోడల్ పాత్రలో అటు ఎక్స్ పోజింగ్, ఇటు బోల్డ్ నెస్ రెండు విషయాల్లోనూ హెబ్బా పటేల్ ఎక్కడా తగ్గలేదు. ఇప్పుడు '24కిసెస్'లోనూ హెబ్బా అదే స్థాయిలో రెచ్చిపోతుందనుకుంటున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా ఎదిగిన తేజ సజ్జా ఈ సినిమాలో హెబ్బా సరసన హీరోగా నటిస్తున్నాడు.

సందేశాత్మకంగా ఉంటుందా?
అయితే ఏదైనా ఒక పరిమితి వరకే బాగుంటుంది కానీ.. హద్దులు దాటితే కష్టమే. అయితే 'మిణుగురులు'లాంటి సినిమా తెరకెక్కించిన దర్శకుడు ఈ సినిమా తీస్తుండటంతో.. అంతర్లీనంగా మంచి సందేశం ఏమైనా యాడ్ చేస్తున్నాడేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











