24 ముద్దులతో రొమాంటిక్ సెగలు, ఫ్రొఫెసర్‌తో లవ్.. ప్రతి ముద్దుకి ఒక్కో ప్రత్యేకత అంటున్న హెబా పటేల్!
Recommended Video

హెబా పటేల్ మరో మారు రొమాంటిక్ సెగలు రేపబోతోంది. కుమారి 21 ఎఫ్ చిత్రంతో యువత హృదయాల్లో ఈ భామ అందాల దేవతగా గూడు కట్టుంది. ఆ చిత్రం తరువాత హెబా పటేల్ టాలీవుడ్ లో సంచలనంగా మారింది. యూత్ లో హేభ కు ఫాలోయింగ్ పెరిగింది. కుమారి 21 ఎఫ్ తరువాత ఆ స్థాయి విజయం మాత్రం దక్కలేదు. తాజాగా 24 కిస్సెస్ చిత్రంతో ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. ఈ చిత్రం గురించి హెబా పటేల్ చెప్పిన విశేషాలు ఆసక్తికరంగా ఉన్నాయి. మిణుగురులు చిత్ర దర్శకుడు అయోధ్య కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

ప్రొఫెసర్‌తో లవ్
తాను ఈ చిత్రంలో మీడియా స్టూడెంట్ పాత్రలో నటిస్తున్నట్లు హెబా పటేల్ తెలిపింది. ఆదిత్ అరుణ్, హెబా ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. తన ప్రొఫెసర్ తోనే ప్రేమలో పడే కథతో ఈ చిత్రం తెరకెక్కుతోందని హెబా తెలిపింది.

గ్లామర్ పాత్రలు చేశా
తాను ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసానని, ఈ చిత్రంలో కూడా గ్లామర్ పాత్ర అయినప్పటికీ ఇది విభిన్నంగా ఉంటుందని చేబోతోంది. సుకుమారమైన యువతిగా ఈ చిత్రంలో కనిపిస్తానని హెబా పటేల్ చెబుతోంది.

24 లిప్ లాక్స్ అంటే
ఈ చిత్రంలో 24 లిప్ లాక్స్ ఉంటాయని దర్శకుడు చెప్పగానే భయపడ్డానని హెబా పటేల్ తెలిపింది. కథ వివరించాకా తన ఆందోళన తగ్గిందని తెలిపింది.

ప్రతి ముద్దుకు ఒక్కో ప్రత్యేకత
ఈ చిత్రంలో ప్రతి ముద్దు సన్నివేశానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుందని హెబా పటేల్ తెలిపింది. ప్రతి ముద్దు సన్నివేశాని అందంగా చిత్రీకరించారు. గతంలో కూడా నాటు ముద్దు సన్నివేశాల్లో నటించిన విషయాన్ని హెబా పటేల్ గుర్తు చేసుకుంది.


Click it and Unblock the Notifications











