పట్టించుకోవడం మానేశా.. చిన్న గ్యాప్ ఉంది.. అందుకే దూరం.. హెబ్బా పటేల్ (ఇంటర్వ్యూ)

By Rajababu

Recommended Video

పట్టించుకోవడమే మానేశా.. అందుకే దూరం..

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'ఏంజెల్'. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి. ఈ చిత్రం నవంబర్ 3న విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్ హెబ్బా పటేల్ విలేకరులతో ముచ్చటిస్తూ... ఏంజిల్ సోసియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అని చెప్పారు.

 లీడ్‌ రోల్‌లో నటిస్తున్నందుకు

లీడ్‌ రోల్‌లో నటిస్తున్నందుకు

ఏంజెల్ చిత్రం నవంబర్ 3న విడుదలవుతున్నది. గ్రీన్ మ్యాట్‌లో చేసిన షూట్‌ను నేను బాగా ఎంజాయ్ చేసి నటించాను. 45 నిమిషాలకు పైగా కంప్యూటర్ గ్రాఫిక్స్(సీజీ) సన్నివేశాలు ఉండడంతో దాదాపు నాలుగు నెలలు కష్టపడి పని చేశారు సినిమా యూనిట్. కుమారి 21ఎఫ్ సినిమా తరువాత మరోసారి ఏంజిల్ టైటిల్ రోల్ లో నటిస్తున్నందుకు హ్యాపీగా ఉన్నాను.

 ఏంజెల్ అని పిలుస్తారు..

ఏంజెల్ అని పిలుస్తారు..

ఏంజెల్ చిత్రంలో నా పాత్ర ఏంజిల్. ఇక నుంచి అందరూ అలానే పిలుస్తుంటారు. దివి నుంచి దిగివచ్చిన నాకు హీరోకు, సప్తగిరికి మధ్య పరిచయం ఎలా అవుతుంది? దివి నుంచి దిగికు ఎలా వచ్చాను ఆ తరువాత ఏం జరిగిందనేదే చిత్ర కథాంశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

 నెర్వస్‌గా ఫీల్ అవుతున్నాను..

నెర్వస్‌గా ఫీల్ అవుతున్నాను..

ఇంతకు ముందు నా సినిమాల కంటే ఈ చిత్రంపై చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను అంతే నెర్వస్‌గాకూడా ఫీల్ అవుతున్నాను. ఈ కథ ఎంచుకోవడానికి మాత్రం సినిమా కంటెంటే ముఖ్య కారణం. స్టోరీ లైన్ బాగా నచ్చింది. డైరెక్టర్ పలణి గారు అద్భుతంగా కథను నారేట్ చేయడమే కాకుండా గ్రాఫిక్స్‌ను కూడా అంతే అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.

 డిఫరెంట్ జోనర్‌లో తొలిసారి

డిఫరెంట్ జోనర్‌లో తొలిసారి

డిఫరెంట్ జోనర్‌లో నటించడం మొదటిసారి కనుకే ఏంజిల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఏంజెల్ పాత్రలో చాలా వేరియేషన్స్ కనపడుతాయి. ఈ సినిమాను చాలా బాధ్యతాయుతంగా నా భుజస్కంధాలపై వేసుకొని నటించానని చెప్పొచ్చు.

హీరో అన్వేష్ హార్డ్ వర్కర్

హీరో అన్వేష్ హార్డ్ వర్కర్

హీరో అన్వేష్ పరిశ్రమకు కొత్తవాడైనా అయినా చాలా హార్డ్ వర్కర్. డాన్స్, ఫైట్స్, యాక్టింగ్ చాలా బాగా చేశారు. భవిష్యత్‌లో మంచి హీరో అవడానికి ఆస్కారం ఉన్న వ్యక్తి. ఈ ఏంజెల్ సినిమాతో తానే ఏంటో రుజువు చేసుకోవడానికి తపించాడు. తప్పకుండా టాలీవుడ్‌లో బిగ్ హీరో అవుతారు అన్వేష్.

 బిజీగా ఉన్నా.. నాకు రెస్ట్ కావాలి..

బిజీగా ఉన్నా.. నాకు రెస్ట్ కావాలి..

ఇక నా విషయానికి వస్తే ఏడాదిన్నర నుంచి వరుస సినిమాలతో షూటింగ్స్ తో బిజీగా గడిపాను అందుచేత కొంతకాలం గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నాను. ముంబైలో ఇల్లు కొన్నాం అక్కడే వాటి పనులు చూస్తూ అక్కడే కొంత రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సినిమా బిజీలో పడి నాకు నేను నా గురుంచి పట్టించుకోవడం మానేశా అందుకే రెస్ట్ కావాలి అనుకుంటున్నాను. చిన్న గ్యాప్ కోసమే ప్రస్తుతానికి ఏ సినిమా లను అంగీకరించడం లేదు అని హెబ్బా పటేల్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X