రెడ్ ఏరియాలో ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా, కరీనా కపూర్
త్వరలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా, కరీనా కపూర్ రెడ్ లైట్ ఏరియా నేఫద్యంలో రూపొందునున్న 'హీరా మండి' చిత్రంలో కనిపించనున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. సంజయ్ లీలా భన్సాలీ, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్లో ఇంతకుముందు దేవదాసు చిత్రం వచ్చింది. ఇక ఈ చిత్రంలో పాత్రలకు మొదట మాధురీ దీక్షిత్, రాణి ముఖర్జీ, సోనమ్ కపూర్ లను అనుకున్నారు. కానీ ఏమైందోగానీ ఇప్పుడు ఆ స్థానంలో ఐశ్వర్య రాయ్, ప్రీతి జింటా, కరీనా కపూర్ లను తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. సినిమాకు 'హీరా మండి' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. 'హీరా మండి' అంటే ముత్యాల బజారు అనే అర్థం. ముత్యాల బజారు ని రెడ్ ఏరియాను పోల్చి అక్కడి యువతుల జీవితాల్ని తెరమీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ ప్రస్తుతం 'గుజారిస్' చిత్రం తెరకెక్కిస్తున్నారు. హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్ జంటగా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











