»   » నాగచైతన్య నెక్ట్స్ జూలై నుంచి...

నాగచైతన్య నెక్ట్స్ జూలై నుంచి...

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : రీసెంట్ గా తడాఖా చిత్రంతో హిట్ కొట్టిన నాగచైతన్య తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నారు. 1994లో వచ్చిన హలో బ్రదర్ రీమేక్ తో ఆయన హిట్ కొట్టాలని భావిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా చేయనున్న ఈ చిత్రానికి శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ విషయమై నిర్మాత డి.శివ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. "మేం కేవలం బేసిక్ ప్లాట్ తీసుకుని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లు మార్పుల చేసి స్క్రిప్టు రెడీ చేసాం. జూలై మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది ," అన్నారు.

నాగార్జున కెరీర్లో చెప్పుకొదగ్గ హిట్ సినిమాల్లో 'హలో బ్రదర్' సినిమాది టాప్ ప్లేస్. నాగార్జున-ఈవివి సత్యనారాయణ కాంబినేషన్లో 1994లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద తన తడాఖా చూపించింది. నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తూ దేవాగా దొంగ పాత్రలో, రాక్ స్టార్‌గా రవి పాత్రలో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను అలరించాడు. నాగార్జున తన కెరీర్లో ద్విపాత్రాభినయం చేసిన తొలి సినిమా కూడా ఇదే.

ఇప్పటి ట్రెండుకు, నాగచైతన్య బాడీ లాంగ్వేజ్‌కు తగిన విధంగా స్ర్కిప్టులో మార్పులు, చేర్పులు చేస్తున్నాడు దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి. అయితే ఈ సినిమాకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. మరి తండ్రి సినిమా రీమేక్ నాగచైతన్య కెరీర్‌ను మరింత బలంగా నిలబెడుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం నాగచైతన్య దేవాకట్ట దర్వకత్వంలో ఆటో నగర్ సూర్య చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary
Nagarjuna, Ramya Krishna and Soundarya starrer Hello Brother (1994) is being remade with Naga Chaitanya as hero. Producer D Siva Prasad Reddy said the movie would go to the floors from July. "We are taking basic plot line of that super hit movie and changing it to the tastes of this generation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu