హలో గురు ప్రేమ కోసమే ప్రీ రిలీజ్ రివ్యూ: లైవ్ అప్ డేట్స్.. రామ్ కెరీర్‌లోనే..

ఉన్నది ఒకటే జిందగీ చిత్రం తర్వాత హీరో రామ్ పోతినేని, అందాల తార అనుపమ పరమేశ్వరన్, ప్రణిత సుభాష్ నటించిన సినిమా హలో గురు ప్రేమ కోసమే. ఈ చిత్రానికి నేను లోకల్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన డైరెక్టర్‌గా వ్యవహరించారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్‌పై లక్ష్మణ్, దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, శిరీష్ సంయుక్తంగా రూపొందించారు. ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ కానున్నది.

రొమాంటిక్ లవ్ స్టోరీగా

రొమాంటిక్ లవ్ స్టోరీగా

హలో గురు ప్రేమ కోసమే చిత్రం ఓ రొమాంటిక్ లవ్ స్టోరి. రామ్ పోతినేని సంజు అనే పాత్రలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా కనిపించనున్నారు. ఓ గ్రామం నుంచి అను (అనుపమ పరమేశ్వరన్) ప్రేమను గెలుచుకోవడానికి పట్టణానికి వస్తాడు. గ్రామీణ నేపథ్యంగా కథ ఓ పది నిమిషాలు కొనసాగుతుంది.

Recommended Video

'Hello Guru Prema Kosame' Movie Pre Release Event | Ram Pothineni | Anupama Parameswaran | Filmibeat
అనుపమ, ప్రణీత గ్లామర్

అనుపమ, ప్రణీత గ్లామర్

హలో గురు ప్రేమ కోసమే చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, ప్రణిత యాక్టింగ్, గ్లామర్ అదనపు ఆకర్షణగా మారనున్నాయి. ప్రకాశ్ రాజ్, మహేష్ ఆచంట, సితార, జయప్రకాశ్, పోసాని కృష్ణ మురళీ, సత్య, సురేష్ పాత్రలు కథకు బలంగా మారనున్నాయి.

ప్రొడక్షన్, సాంకేతిక విలువలతో

ప్రొడక్షన్, సాంకేతిక విలువలతో

మంచి నిర్మాణ విలువలతో హలో గురు ప్రేమ కోసమే చిత్రం రూపొందిందనే మాట వినిపిస్తున్నది. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బాణీలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ కే చక్రవర్తి సినిమాటోగ్రఫీ, ప్రసన్న కుమార్ డైలాగ్స్, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ ప్లస్ పాయింట్స్‌గా నిలిచే అవకాశం కనిపిస్తున్నది.

ప్రకాశ్ రాజ్ పాత్ర ఆకర్షణగా

ప్రకాశ్ రాజ్ పాత్ర ఆకర్షణగా

ప్రకాశ్ రాజ్ పాత్ర ఈ చిత్రంలో హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నది. అనుపమ పరమేశ్వరన్ తండ్రి పాత్రలో రామ్‌కు మామగా ఓ ప్రత్యేకమైన పాత్రలో ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. హస్యంతోపాటు ఫ్యామిలీ విలువలను చెప్పే చిత్రమనే టాక్ వినిపిస్తున్నది.

 పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా

పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా

హలో గురు ప్రేమ కోసమే పక్కా కుటుంబ కథా చిత్రంగా రూపొందిందనే మాట వినిపిస్తున్నది. పండుగ నేపథ్యంలో ప్రేక్షకులకు ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించామని నిర్మాతలు వెల్లడించారు. ఇంటిల్లిపాది చూసి ఎంజాయ్ చేయడం గ్యారంటీ అంటున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది.

గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్

గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ బిజినెస్

హలో గురు ప్రేమ కోసమే చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా సంతృప్తికరంగా జరిగినట్టు ట్రేడ్ రిపోర్ట్. సుమారు రూ.25 కోట్ల మేర ఈ చిత్ర బిజినెస్ జరిగిందని, రామ్ స్టామినాను పరిశీలిస్తే ఇది సేఫ్ ప్రాజెక్ట్ అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X