‘హలో గురు ప్రేమ కోసమే’ ట్విట్టర్ రివ్యూ... టాక్ ఎలా ఉందంటే?
Recommended Video

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మించి ప్రేమకథా చిత్రం హలో గురూ ప్రేమ కోసమే. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రాల డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు.
రామ్ హీరోగా నటించడం, దిల్ రాజు బేనర్ నుంచి వస్తున్న చిత్రం కావడం, ఇంతకు ముందు సినిమా చూపిస్త మావ, నేను లోకల్ లాంటి చిత్రాలు అందించిన దర్శకుడు కావడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాపై ఆడియన్స్ టాక్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
జస్ట్ టైమ్ పాస్‌మూవీ
రోటీన్ స్టోరీ, ఫస్టాఫ్ కామెడీ ఫర్వాలేదు. సెకండాఫ్‌లో రోటీన్ క్లైమాక్స్ ఉన్నా సినిమా బావుంది. ఓవరాల్ గా టైమ్ పాస్ మూవీ.
డిసెంట్, వన్ టైమ్ వాచ్
హలోగురు ప్రేమ కోసమే డీసెంట్ మూవీ. ఒకసారి చూడొచ్చు అనే అభిప్రాయాలు వీక్షకుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.
ఆ సీన్లు ఇరిటేటింగ్
రోటీన్ కాన్సెప్టుకు కాస్త కామెడీ జోడించారు. ప్రకాష్ రాజ్, రామ్ మధ్య వచ్చే సీన్లు ఇరిటేటింగ్‌గా ఉన్నాయి.
ఇంతకు మించి రేటింగ్ ఇవ్వలేం
మరో రోటీన్ మూవీ, టైమ్ పాస్ బొమ్మ... ఫస్టాఫ్ డీసెంట్, సెకండాప్ నెమ్మదిగా ఉంది. కామెడీ ఫర్వాలేదు. ప్రకాష్ రాజ్, రామ్ సీన్లు బావున్నాయి. ఈ చిత్రానికి 2.73/5 మించి రేటింగ్ ఇవ్వలేం.
ఎబో యావరేజ్
ఫస్టాప్ బావుంది, సెకండాఫ్ ఎబో యావరేజ్ అనేలా ఉంది. కామెడీ వర్కౌట్ అయింది. డిసెంట్ వాచబుల్ మూవీ.
రామ్ కమెడీ టైమింగ్
రామ్ కామెడీ టైమింగ్ బావుంది. దానికోసమైనా సినిమా ఒకసారి చూడొచ్చు.


Click it and Unblock the Notifications











