సహాయం చేయాలని కోరుతున్న రాజమౌళి
హైదరాబాద్: మంచి పనులను, మంచి సినిమాలను ప్రోత్సహించడం, సోషల్ రెస్పాన్సబులిటీని గుర్తు చేయడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి చేయడంలో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తనదైన పాత్ర పోషిస్తుంటారు. తాజాగా హుధూద్ తుఫాన్ కారణంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో నష్టం వాటిల్లిన నేపథ్యంలో....సీఎం రిలీఫ్ ఫండ్‌కి సహాయం అందించాలని రాజమౌళి తన సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులను కోరుతున్నాడు.

రాజమౌళి ఫేస్ బుక్ బోస్టును ఇక్కడ చూడొచ్చు...
రాజమౌళి సినిమాల విషయానికొస్తే....
ప్రస్తుతం ఆయన ‘బాహుబలి' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈచిత్రాన్ని ఆర్కామీడియా బేనర్లో శోభు యార్లగడ్డ నిర్మిస్తున్నారు. తెలుగు సినిమా చరిత్రలోనే ఈ చిత్రం ఓ ప్రతికష్టాత్మక చిత్రం. రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
త్వరలో నటుడిగా కనిపించబోతున్న రాజమౌళి...
వీర శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘మన కుర్రాళ్ళే' (ది లేటెస్ట్ జనరేషన్) చిత్రంలో గెస్ట్ గా చేయనున్నారని తెలుస్తోంది. సీన్ ప్రకారం... ఆయన ఓ ఆడియో పంక్షన్ కి హాజరవుతారు. ఈ షాట్ కోసం ఆయన రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం మూడు గంటలు దాకా షూటింగ్ కు హాజరయ్యారు. సినిమాలో ఈ సీన్ కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











