తమిళ హీరో విజయ్ కోసం తెలుగు సింగర్
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తమిళంలో నన్ బన్ అనే చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. హిందీలో భారీ విజయం సాధించిన '3ఇడియట్స్'కి ఇది రీమేక్. నన్ బన్ చిత్రాన్ని తెలుగులో స్నేహితుడు పేరుతో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు స్నేహితుడు సినిమా తెలుగు డిస్ర్టిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్నాడు. జనవరి 26న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.
ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న స్నేహితుడు సినిమాకుగాను...హీరో విజయ్ పాత్రకు తెలుగు సింగర్ హేమచంద్రను డబ్బింగ్ చెప్పేందుకు ఎంపిక చేశారు. చాలా మంది వాయిస్ ను టెస్ట్ చేసిన తర్వాత హేమచంద్రను ఖరారు చేశారు.
తమిళ హీరోలు విజయ్, జీవా, శ్రీకాంత్, ఇలియాన ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరో వారంలో ఆడియో విడుదల చేయనున్నారు. ఇప్పటికే హిందీ 3 ఇడియట్స్ వెర్షన్ ను తెలుగులో చాలా మంది ఆదరించిన నేపథ్యంలో....అదే కథాంశంతో సీన్ టు సీన్ రూపొందుతున్న 'స్నేహితుడు' చిత్రం ఏమేరకు విజయవంతం అవుతుందో చూడాలిమరి.


Click it and Unblock the Notifications











