శ్రీముఖిపై హేమ కామెంట్స్.. ఆ బ్యాచ్ అలాంటిదంటూ సెన్సేషన్!

బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. నాగార్జున హోస్ట్‌గా కొనసాగుతున్న ఈ షోలో ఆయన ఇస్తున్న టాస్క్‌లు స్పెషల్ కిక్ ఇస్తున్నాయి. జులై 21వ తేదీన ప్రారంభమైన ఈ షో విజయవంతంగా పద్నాలుగో వారం ఫినిష్ చేసుకోబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై బుల్లితెర ఆడియన్స్‌లో క్యూరియాసిటీ నెలకొంది. సరిగ్గా ఈ తరుణంలో యాంకర్ శ్రీముఖి గురించి హేమ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాలు చూద్దామా..

శ్రీముఖికే విన్నింగ్ అవకాశాలు! ఈ పరిస్థితుల్లో..

శ్రీముఖికే విన్నింగ్ అవకాశాలు! ఈ పరిస్థితుల్లో..

15 మంది పార్టిసిపెంట్స్‌తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 3 రసవత్తరంగా సాగుతోంది. ప్రతీ వారం ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ చివరగా ఆరుగురు మాత్రమే మిగిలారు. ఇప్పుడు మిగిలిన వారిలో శ్రీముఖికే విన్నింగ్ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో శ్రీముఖి గురించి హేమ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 3లో హేమ

బిగ్ బాస్ సీజన్ 3లో హేమ

టాలీవుడ్ నటి, కమెడియన్ హేమ బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసి మొదటి వారమే ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ తర్వాత కూడా ఆమె బిగ్ బాస్‌పై కొన్ని ఆరోపణలు చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజాగా సీజన్ ముగింపుకు సమయం దగ్గరపడ్డ ఈ తరుణంలో మరోసారి నోరు విప్పింది హేమ.

ఆ తర్వాత షో చూడటం మానేశా

ఆ తర్వాత షో చూడటం మానేశా

తాజాగా ఓ ఇంటర్య్యూలో మాట్లాడిన హేమ బిగ్ బాస్ రియాల్టీ షోపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా శ్రీముఖిని టార్గెట్ చేస్తూ ఆమె చేసిన కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత, హిమజ ఎలిమినేట్ అయ్యేంత వరకూ మాత్రమే చూశానని, ఆ తర్వాత షో చూడటం మానేశానని చెప్పి షాకిచ్చింది హేమ.

వాళ్లంతా ఓ స్కెచ్ వేసి నన్ను పంపారు

వాళ్లంతా ఓ స్కెచ్ వేసి నన్ను పంపారు

షోలో ఇప్పుడు మిగిలిన వాళ్లంతా ఒక గ్రూప్ వాళ్లే అంటూ హేమ షాకింగ్ కామెంట్ చేసింది హేమ. వీరందరూ ముందుగానే ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ ప్రకారమే షో నడుస్తోందని అనేసింది. నేను ఓ స్ట్రాంగ్ కంటిస్టెంట్ అవుతానేమో అని భావించి వీళ్ళే ఓ స్కెచ్ వేసి నన్ను బయటకు పంపించేశారని హేమ చెబుతుండటం పలు చర్చలకు దారి తీస్తోంది.

శ్రీముఖిపై నెగెటివ్ ఇంపాక్ట్

శ్రీముఖిపై నెగెటివ్ ఇంపాక్ట్

100 రోజుల బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ముగుస్తున్న ఈ సమయంలో బిగ్ బాస్ విన్నర్ ఎవరా? అని అంతా ఆలోచిస్తుంటే.. ఇప్పుడు హేమ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అంతా బిగ్ బాస్ విన్నర్‌ అనుకుంటున్న శ్రీముఖి విషయంలో హేమ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఇది శ్రీముఖికి నెగెటివ్ ఇంపాక్ట్ అంటున్నారు జనం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X