సొంత నిర్ణయాలొద్దు.. నరేష్‌కు హేమ వార్నింగ్.. ప్రమాణస్వీకారం రోజే ‘మా’లో కుమ్ములాటలు!

Recommended Video

Hema Not Happy With Naresh Behaviour | MAA | Filmibeat Telugu

శుక్రవారం రోజు మా అసోసియేషన్ కు కొత్త కార్యవర్గం ఏర్పడింది. ఈ ఉదయం జరిగిన మా సోసియేషన్ కొత్త సభ్యుల ప్రమాణస్వీకారోత్సవంలో నరేష్ అధ్యక్షుడిగా భాద్యతలు స్వీకరించారు. జీవిత, హేమ, రాజశేఖర్, ఇతర ప్రముఖులు కూడా మా సోసియేషన్ లో వారి భాధ్యతల్ని స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల, రెబల్ స్టార్ కృష్ణం రాజు, కోట శ్రీనివాసరావు, జయసుధ అతిధులుగా హాజరయ్యారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

 కానుకలు ప్రకటించిన నరేష్

కానుకలు ప్రకటించిన నరేష్

మా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నరేష్ ప్రసంగిస్తూ.. మా సభ్యులకు కొన్ని కానుకలు అందిస్తున్నా అంటూ తన నిర్ణయాలు ప్రకటించారు. మా సభ్యత్వ రుసుము లక్ష రూపాయల నుంచి 90 వేలుకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాడు. అలాగే కేవలం 25 వేల రూపాయలకు సభ్యులకు గోల్డ్ కార్డు ఇవ్వబోతున్నట్లు నరేష్ ప్రకటించారు. ఈ కార్డు ద్వారా సభ్యులకు అనేక సంక్షేమ పథకాలు అందుతాయని నరేష్ ప్రకటించారు.

 హేమ అలక

హేమ అలక

వేదికపై జీవిత మాట్లాడక హేమ మాట్లాడాలని భావించింది. కానీ ఆమె చేతి నుంచి నరేష్ మైక్ లాగేసుకుని వద్దు అని వాదించాడు. అందరి తరుపున నన్ను మాట్లాడమని కోరుతున్నారు అని తెలిపినా నరేష్ వినిపించుకోలేదు. నా దగ్గర మైక్ లాగేసుకున్నాడు అంటూ హేమ అక్కడున్నవారందరితో గొడవ పెట్టుకుంటూ కనిపించింది. ఇది గమనించిన రాజశేఖర్ సరే మాట్లాడు అంటూ మైక్ ఇచ్చాడు. ఇదేం బాగాలేదు.. నాట్ గుడ్ అని హేమ అసహనం వ్యక్తం చేసింది.

నాకు నచ్చలేదు

నాకు నచ్చలేదు

నరేష్ గారు ప్రకటించిన అంశలన్నీ ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయాలే. మమ్మల్ని ఇంతరవరకు సంప్రదించలేదు.. కనీసం మీటింగ్ లో కూడా చెప్పలేదు అని హేమ తెలిపింది. మమ్మల్ని కలుపుకోకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. చాలా మందిలో ఈ అసంతృప్తి ఉంది. వారందరి తరుపున నేను మాట్లాడుతున్నా. మా కార్యవర్గంలో 26మంది సభ్యులు ఒక్కటే. అంతా కలసి నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన చేయండి అని హేమ తెలిపింది. సారీ నరేష్ గారు మీరిలా చేయడం నాకు నచ్చలేదు అంటూ హేమ తన ప్రసంగాన్ని ముగించింది.

తడబడుతూ

తడబడుతూ

హేమ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో కూడా తడబడుతూ కనిపించింది. ప్రమాణ స్వీకార పత్రాన్ని సరిగా చదవలేక తెగ ఇబ్బంది పడిపోయింది. గతంలో కూడా మా డైరీ లాంచ్ కార్యక్రమంలో కృష్ణ గారి గురించి ప్రసంగిస్తూ తెలుగు చదవలేక ఇబ్బంది పడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X