twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ కళ్యాణ్ గారు వచ్చారు.. ఇండస్ట్రీ మొత్తం కదిలింది, ఫస్ట్‌టైం ఏడ్చా.. నటి హేమ!

    |

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న నటి హేమ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో చోటు చేసుకున్న వివాదాల గురించి మాట్లాడారు. హేమ చాలా చిత్రాల్లో కెలకమైన పాత్రలు చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ కథ చిత్రాల్లో హేమకు ఎక్కువగా అవకాశాలు దక్కుతుంటాయి. ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తన కుటుంబ నేపథ్యం, తరచుగా టాలీవుడ్ లో చెలరేగుతున్న వివాదాల గురించి హేమ తన అభిప్రాయాలు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

    అక్క చెల్లెళ్ళ వలనే

    అక్క చెల్లెళ్ళ వలనే

    తాను కాపు ఉద్యమంలో పాల్గొనడం వలన సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయి అని ఆనందంలో అర్థం లేదని హేమ అన్నారు. టాలీవుడ్ లో కుల ప్రస్తావన లేదని హేమ తెలిపారు. నా చిన్న తనంలో మా అక్క చెల్లెల్లు అనుభవించిన కష్టాలని కళ్లారా చూశా. మా అమ్మ వడ్డీ వ్యాపారం చేయడం వలన బాగా సంపాదించింది. అంతకు ముందు తాము పేదవారిమే అని హేమ అన్నారు. అలాగే మా వర్గంలో ఇప్పటికి అంట్లు తోముకుంటూ నిరుపేదలుగా ఉన్న వారు ఎందరో ఉన్నారు అంటూ హేమ భావోద్వేగానికి గురైంది. చిత్ర పరిశ్రమకు వచ్చిన మొట్టమొదటి సారి తానూ ఏడుస్తున్నానని హేమ తెలిపింది.

    బ్రహ్మానందంతో విభేదాలు

    బ్రహ్మానందంతో విభేదాలు

    బ్రహ్మానందంతో తనకు ఉన్నవి చిన్న విభేదాలే అని హేమ అన్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిందే. త్వరలో కోలుకుని మనల్స్ని నవ్వించడానికి బయటకు వస్తారని హేమ తెలిపింది. వాస్తవానికి తాను రాజకీయాల్లోకి వెళ్లేందుకు ప్రోత్సహించింది బ్రహ్మానందం గారే అని హేమ అన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా ఇండస్ట్రీలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని హేమ తెలిపింది. ఇండస్ట్రీలో కులాలు ఉండి ఉంటె చిరంజీవి గారు అంత పెద్ద స్టార్ కావడం సాధ్యం అయ్యేది కాదేమో అని హేమ అన్నారు.

     శ్రీకాంత్ మనస్తాపం

    శ్రీకాంత్ మనస్తాపం

    శివాజీ రాజా, నరేష్ మధ్య తలెత్తిన విభేదాల వలన శ్రీకాంత్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటూ ఆ వివాదం గురించి హేమ ప్రస్తావించారు. మా అసోసిషన్ లో చర్చించిన ఆంతరంగిక విషయాలు బయట చెప్పకూడదనే రూల్ ఉంది . ఆ రూల్ అతిక్రమించడం వలనే ఈ వివాదం జరిగిందని హేమ తెలిపింది. వాస్తవానికి శ్రీకాంత్ కు ఉన్న పరిచయాల ద్వారా మా అసోసియేషన్ కు ఎంతో మేలు జరుగుతోంది. అలాంటి తనని కూడా ఈ వివాదంలోకి లాగారని శ్రీకాంత్ మనస్థాపానికి గురైనట్లు హేమ తెలిపింది.

     మీడియాలో ఎలా పడితే అలా

    మీడియాలో ఎలా పడితే అలా

    గత ఏడాది కాస్టింగ్ కౌచ్ పేరుతో చిత్ర పరిశ్రమపై జరిగిన అటాక్ గురించి హేమ ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ వచ్చే వరకు తమని మీడియాలో ఎలా పడితే అలా చూపించారు. బూతు హెడ్డింగులు పెట్టి దూషించారు. అవాస్తవాలన్నీ చూపించి ఇండస్ట్రీని బజారుకు ఈడ్చారని హేమ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ రాగానే ఇండస్ట్రీ మొత్తం కదిలింది. తమకు మీడియా నుంచి విముక్తి లభించింది అని హేమ తెలిపారు. పవన్ కళ్యాణ్ వచ్చి మొదట ఇక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయో అవి సరిచేసుకోండి. ఆ తర్వాత గట్టిగా మాట్లాడవచ్చు అని పవన్ చెప్పినట్లు హేమ తెలిపింది.

     టివి ఛానల్ యాంకర్

    టివి ఛానల్ యాంకర్

    ఆ వివాదం జరుగుతున్న సమయంలో ఓ టివి ఛానల్ యాంకర్ ఇండస్ట్రీలోని మహిళల గురించి మాట్లాడుతూ పరుష పదజాలం ఉపయోగించాడు. అతడి గురించి మీరు ఎందుకు వేయరు అని మిగిలిన ఛానల్స్ వాళ్ళని అడిగాను. మేము ఎందుకు వేయాలి అని అన్నారు. నేను కూడా మీ ప్రశ్నలకు ఎందుకు సమాధానం చెప్పాలి అంటూ మీడియా సమావేశం నుంచి బయటకు వచ్చేశానని హేమ తెలిపింది.

    7వ తరగతి వరకే

    7వ తరగతి వరకే

    ఓ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల గారి గురించి తడబడుతూ మాట్లాడాను. వాస్తవానికి నేను చదువుకున్నది 7వ తరగతి వరకే. సినిమాల్లో కూడా డైలాగులు చదివి చెప్పను. అసిస్టెంట్ డైరెక్టర్ వినిపిస్తారు. నేను వెళ్లి షాట్ కంప్లీట్ చేస్తా అంతే. కానీ ఆరోజు కృష్ణగారి గురించి చదవాలి అంటూ పేపర్ లో రాసి ఇచ్చారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత నేను చదవడం అదే తొలిసారి అందుకే తడబడ్డా అని హేమ తెలిపారు.

    English summary
    Hema interesting comments on media controversy with Tollywood
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X