అరెస్టు :పోలీసుల అదుపులో హేమమాలిని కారు డ్రైవర్
జైపూర్: ప్రముఖ సీనీనటి, బీజేపీ ఎంపీ హేమమాలిని కారు యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజస్థాన్ పోలీసులు వెంటనే ఎలర్టై ఆ కారు డ్రైవర్ మహేశ్ ఠాకూర్ ను శుక్రవారం ఉదయం అరెస్టు చేశారు. ఏ విధమైన అనవసరమైన ఉద్రిక్త పరిస్థితులు తలెత్త కూడదనే ఉద్దేశంతోనే పోలీసులు ఎంపీ కారు డ్రైవర్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
యాక్సిడెంట్ వివరాల్లోకి వెళితే..
బిజెపి ఎంపి, ప్రముఖ సినీ నటి హేమమాలిని రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమెకి రోడ్డు ప్రమాదంలో స్వల్ప గాయాలయ్యాయి. ఆమె ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీ కొనడంతో ఆమె గాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందారు.

రాజస్థాన్‌లోని దౌసా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆమె నియోజకవర్గం మథుర నుంచి రాజస్థాన్ రాజధాని జయపురకు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
గురువారం రాత్రి 8.50 గంటలకు జయపురకు 60కి.మీ దూరంలోని దౌసా సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు మారుతి ఆల్టోను ఢీకొంది. ఆగ్రా నుంచి జైపూర్ వెళుతుండగా వేగంగా వెళుతున్న కారును మరో కారు బలంగా ఢీ కొనడంతో కార్లు బోల్తా పడి ప్రమాదం జరిగింది.
ప్రమాదంలో ఆల్టోలో ప్రయాణిస్తున్న రెండేళ్ల చిన్నారి సోనమ్ అని ప్రాథమిక సమాచారం. హేమామాలినికి స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కుడి కంటిపైన నుదురు భాగంలో దెబ్బతగిలి రక్తస్రావమైంది. వెంటనే జయపురలోని ఫోర్టీస్ ఆసుపత్రికి తరలించగా ప్రథమచికిత్స చేశారు.


Click it and Unblock the Notifications











