మాజీ మొగుడికి క్లోజవుతున్న హేమామాలిని
ఒకప్పటిన బాలీవుడ్ చూడముచ్చటి జంటల్లో హేమామాలిని-ధర్మేంద్ర ఒకరు. ఆకాలంలో వెండి తెరపై ఓ వెలుగు వెలిగిన ఈ దంపతులు కొన్ని కారణాలవల్ల విడిపోయిన విషయం తెలిసిందే. కూతుళ్లతో హేమ, కొడుకులతో ధర్మేంద్ర విడిడివిగా ఉంటున్నారు. దూరం ఎంత పెరిగితే మనసులు అంత దగ్గర అవుతాయన్న చందంగా.....హేమామాలిని, ధర్మేంద్ర మళ్లీ క్లోజ్ అవుతున్నారు.
హేమా మాలిని నిర్మాణ, దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ చిత్రం 'టెల్ మి ఓ ఖుదా". ఇందులో ఆమె మాజీ భర్త ధర్మేంద్ర, కుమార్తె ఇషా డియోల్ తొలిసారి వెండి తెరపై తండ్రి కూతుర్లుగా కనిపించబోతున్నారు. వాస్తవానికి ధర్మేంద్ర పాత్రకు తొలుత అమితతాబ్ బచ్చన్ అయితే బాగుటుందని అనుకున్నారు. కానీ అమితాబ్ ఒప్పుకోక పోవడంతో ధర్మేంద్రను ఎంపిక చేశారు.
ఈ విషయమై హేమ మాలిని ఏమంటోందంటే....'ఒక్కోసారి మనకు తెలియకుండా మంచే జరుగుతుంది. అమితాబ్ నటించేందుకు ఒప్పకుని ఉంటే ధర్మేంద్ర గురించి ఆలోచించేదాన్ని కాదేమో? తండ్రి కూతుర్లు తెరపై కనిపించే వారు కాదేమో? ఇలా జరుగుడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పకొస్తోంది.
అయితే...బాలీవుడ్ వర్గాలు మాత్రం మరోలా చర్చించుకుంటున్నారు. వృద్దాప్యానికి దగ్గరవుతున్న హేమమలిని తోడు కోసం ఆరాట పడుతోందని, తన నుంచి విడిపోయి భర్తను ఈ విధంగా తన లైన్ లోకి లాగుతోందిని గుసగుసలాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











