విడాకుల వ్యవహారం మీద స్పందించిన హేమచంద్ర-శ్రావణభార్గవి.. అయినా క్లారిటీ రాలేదుగా!

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో గాయనీ గాయకుల జంట హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోయే అవకాశాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వారు కూడా ఈ విషయం మీద మౌనం పాటిస్తూ ఉండడంతో మీరు విడాకుల వ్యవహారం నిజమే అని సూచనలు పంపినట్లు అయింది. ఇలాగే వదిలేస్తే మరింత ప్రచారం చేస్తారు అనుకున్నారు ఏమో తెలియదు కానీ ఈ విషయం మీద అటు హేమచంద్ర ఇటు శ్రావణ భార్గవి ఇద్దరూ కూడా తమ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా స్పందించారు. వివరాల్లోకి వెళితే..

షేర్ చేస్తూ

షేర్ చేస్తూ


సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి ఇద్దరూ కూడా టాలీవుడ్ లో గాయనీ నాయకులుగా స్థిరపడ్డారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో వీరిద్దరూ ప్రేమించుకోవడమే గాక పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది. వీరిద్దరూ తమ కుమార్తెతో గడిపిన సరదా క్షణాలను కూడా తమ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉండేవారు.

నిజమే అయి ఉండవచ్చు

నిజమే అయి ఉండవచ్చు


అయితే ఎప్పుడు మొదలైందో ఎక్కడ మొదలైందో తెలియదు కానీ హేమచంద్ర శ్రావణ భార్గవి విడాకులు తీసుకునే అవకాశం ఉందంటూ ఒక కొత్త రకం ప్రచారం సోషల్ మీడియాలో మొదలైంది. ఈ విషయం మీద అటు హేమచంద్ర గాని ఇటు శ్రావణ భార్గవి గాని స్పందించకుండా తమ తమ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వేరే ఇతర పోస్టులు షేర్ చేయడంతో ఈ ప్రచారం నిజమే అయి ఉండవచ్చు అంటూ వారి అభిమానులు కూడా భావించిన పరిస్థితి నెలకొంది.

ఏకకాలంలో

ఏకకాలంలో


దానికి తగ్గట్టుగా శ్రావణ భార్గవి తన పోస్టులకు కామెంట్ చేసే ఆప్షన్ లేకుండా దాన్ని డిజేబుల్ చేయడంతో నిజంగానే విడాకులు తీసుకుంటున్నారు కాబోలు అందుకే ఆ విషయం మీద ఎవరూ చర్చించకుండా ఉండడం కోసం కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసిందని ప్రచారం కూడా జరిగింది. ఈ ప్రచారాల నేపథ్యంలో అటు హేమచంద్ర శ్రావణ భార్గవి ఏకకాలంలో స్పందించారు.

 వేగంగా వ్యాప్తి

వేగంగా వ్యాప్తి


తన యూట్యూబ్ వ్యూస్ మొదలు తన సంపాదన, తనకు వర్క్ కూడా పెరిగిందని నెగిటివ్ ప్రచారమో, పాజిటివ్ ప్రచారమో తెలియదు కానీ మీడియా కొన్నిసార్లు మంచి చేస్తుందంటూ శ్రావణ భార్గవి కామెంట్ చేసింది. ఈ వార్తలు రాసే వారికి పని లేదు అని అర్థం వచ్చే విధంగా కామెంట్ చేస్తూ అవసరం లేని అర్థంలేని వార్తలు మంచి విషయాలు కంటే వేగంగా వ్యాప్తి చెందుతాయి అంటూ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ షేర్ చేశారు.

Recommended Video

YS Jagan పదవుల పంపకం... బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి కీలక పదవి *Politics | Telugu Oneindia
కామెంట్స్ కూడా ఆఫ్

కామెంట్స్ కూడా ఆఫ్


తమ విడాకుల వ్యవహారం మీద కౌంటర్లు వేస్తూ మాట్లాడారు కానీ అది నిజమో, కాదంటూ ఎక్కడ పేర్కొనక పోవడంతో వీరి మధ్య ఇంకా ఏదో తేడా గానే ఉందే అంటూ వారి పోస్టుల కింద కామెంట్లు చేస్తున్నారు.. ఎందుకు వచ్చిన టెన్షన్ అని శ్రావణ భార్గవి ఆ పోస్ట్ కామెంట్స్ కూడా ఆఫ్ చేసేసింది. దీంతో హేమచంద్ర పోస్ట్ మీద కామెంట్లు పెద్ద ఎత్తున చేస్తున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X