Don't Miss!
- News
vastu tips: అప్పుల బాధలు పడలేకపోతున్నారా? ఈ వాస్తుదోషాలు సరి చేసుకోండి!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Technology
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
విడాకుల దశగా మరో టాలీవుడ్ జంట.. అదే ప్రూఫ్ అంటూ ప్రచారం!
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువై పోయాయి.. ఎప్పుడు ఏ సెలబ్రిటీ జంట విడాకుల వార్త చెబుతుంది అనే విషయం మీద ఎవరికీ అవగాహన ఉండటం లేదు. ఇప్పటికే తెలుగులో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు ప్రకటించగా ఇప్పుడు మరో జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

గాత్రదానం చేసి
తెలుగులో
హేమచంద్ర
తన
తండ్రి
గాన
వారసత్వాన్ని
అందిపుచ్చుకుని
గాయకుడిగా
మంచి
పేరు
తెచ్చుకున్నాడు.
తెలుగులో
ఇప్పటికే
పదుల
సంఖ్యలో
పాటలు
పాడిన
ఆయన
తనకంటూ
ఒక
మంచి
పేరు
ఏర్పరచుకున్నాడు.
కేవలం
గాయకుడు
గానే
కాకుండా
డబ్బింగ్
ఆర్టిస్ట్
గా
కూడా
ఎంతో
మందికి
గాత్రదానం
చేసిన
ఆయన
తన
సహ
గాయని
శ్రావణ
భార్గవిని
ప్రేమించి
పెద్దలను
ఒప్పించి
వివాహం
చేసుకున్నాడు.

అధికారికంగా ప్రకటించే అవకాశం
వీరిద్దరూ 2013వ సంవత్సరంలో వివాహం చేసుకోగా వీరికి శిఖర చంద్రిక అనే ఒక పాప కూడా జన్మించింది. ఆ పాప 2016వ సంవత్సరంలో జన్మించగా అప్పుడు శ్రావణ భార్గవి కెరీర్ కాస్త వెనుకబడింది. కానీ హేమచంద్ర మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అయితే ఎందుకు మొదలైందో ఎలా మొదలైందో తెలీదు కానీ వీరిద్దరూ ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి రంగం సిద్ధమైందని మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

క్లారిటీ ఇవ్వలేక
అయితే సాధారణంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు పోస్టులు షేర్ చేస్తూ ఉండే హేమచంద్ర ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియ చేయకపోవడంతో ఈ విషయం నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. హేమచంద్ర చాలా మంది హీరోలకు, విలన్ పాత్ర దారులకు డబ్బింగ్ చెప్పి చాలా ఫేమస్ అయ్యారు. అయితే శ్రావణ భార్గవిని ప్రేమించి పెళ్లాడిన ఆయన ఎందుకు విడాకులు తీసుకోబోతున్నాడు అనే విషయం మీద మాత్రం ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.

సంగీత దర్శకుడిగా
ఈ విషయం కనుక నిజం కాకుండా ఉంటే ఈ పాటికి ఆయన సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక రకమైన స్పందన తెలియ చేసే వారని అటు హేమచంద్రతో పాటు ఇటు శ్రావణ భార్గవి కూడా ఈ విషయం మీద వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉండడంతో ఇది నిజమేనేమో అని ఇప్పుడు అందరూ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హేమచంద్ర తర్వాత కొన్ని సినిమాలకు సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు.

క్లారిటీ వచ్చే అవకాశం
అలాగే ఒక సొంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దాని ద్వారా ఆయన యూత్ తో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా సదరు చానల్ ద్వారా కొన్ని సాంగ్స్ విడుదల చేసి ఆయన శ్రోతలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ విడాకుల వార్తల మీద వారు స్వయంగా స్పందిస్తే తప్ప ఇది నిజమా అబద్దమా అనే విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు.