Don't Miss!
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
ఘనంగా హేమచంద్ర-శ్రావణ భార్గవి వివాహం (ఫోటోలు)
హైదరాబాద్: అటు బుల్లి తెరతో పాటు, ఇటు వెండి తెరపై ప్లేబ్యాక్ సింగర్లుగా ఇటీవల కాలంలో బాగా పాపులర్ అయిన గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవి. గత కొంత కాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ ఇద్దరు ప్రేమికుల రోజున పెళ్లితో ఒక్కటయ్యారు. వీరి వివాహం గురువారం(ఫిబ్రవరి 14) ఉదయం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలకు సంబంధించిన వారు, వారి సన్నిహితులు, స్నేహితులు హాజరయ్యారు.
ఇతర వివరాల్లోకి వెళితే....
యంగ్ ఏజ్ లోనే సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఇద్దరూ అనతి కాలంలోనే తమ ప్రతిభతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పలు టీవీ సింగింగ్ రియాల్టీ షోలలో పాల్గొన్నారు. సప్తస్వరాలు రియాల్టీ షోలో శ్రావణ భార్గవి రన్నరప్ గా నిలిచింది. స.రే.గ.మ.ప రియాల్టీ షోలో హేమచంద్ర సెకండ్ రన్నరప్ గా నిలిచాడు.
ఇద్దరి మధ్య వయసు తేడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. హేమచంద్ర 1988, జున్ 2న జన్మించగా..... శ్రావణ భార్గవి 1990లో జన్మించింది. హేమచంద్ర తన తల్లి వద్దర కర్నాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. శ్రావణ భార్గవి లలిత, హరి ప్రియ దగ్గర సంగీతం నేర్చుకుంది.

హేమచంద్ర, శ్రావణ భార్గవి పెళ్లి దృశ్యాలు

హేమ చంద్ర, శ్రావణ భార్గవి పెళ్లి దృశ్యాలు

హేమచంద్ర, శ్రావణ భార్గవి నిశ్చితార్థం నాటి దృశ్యం

సంగీత దర్శకుడు మణిశర్మతో హేమచంద్ర, శ్రావణ భార్గవి

హేమచంద్ర, శ్రావణ భార్గవి

హేమచంద్ర, శ్రావణ భార్గవి