కమల్ తో డ్రీమ్ గాళ్!
ఆమె బాలీవుడ్ డ్రీమ్ గాళ్...ఆయనేమో ముద్దుల వీరుడు కమల్ హాసన్.. ఇద్దరూ కలువనున్నారు. బయటకాదు. కలిసి సినిమా చేయనున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం హేమమాలిని, కమల్ తో కలిసి హై రామ్ సినిమాలో నటించింది. అందులో ఆమె కామియో రోల్ పోషించింది. ఇపుడు కమల్ హాసన్ హీరోగా రూపొందనున్న మర్మయోగి సినిమాలో హేమమాలిని హీరోయిన్ గా ఎంపిక అయింది. హేమమాలినితో పాటు మరికొందరు హీరోయిన్లు ఇందులో నటించనున్నారు.
కమల్ పై ఉన్న నమ్మకంతో హేమమాలిని మర్మయోగి సినిమాకు సంబంధించి ఎలాంటి ఆరాలు తీయకుండా ఒప్పేసుకుంది. కమల్ హాసన్ దర్శకత్వం వహించే ఈ సినిమాలో మరికొంతమంది వెటరన్ నటులు నటించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సినిమా జనవరిలో ప్రారంభం కానున్నది.


Click it and Unblock the Notifications











