రాజమౌళిపై స్నేహితుడు సంచలన ఆరోపణలు.. సోషల్ మీడియాలో జక్కన దిమ్మతిరిగేలా రియాక్షన్!
తెలుగు సినిమా దగ్గర అతి తక్కువసార్లు కాంట్రవర్సీల్లో కనిపించే టాప్ మోస్ట్ దర్శకుల్లో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఒకరని అందరికీ తెలిసిందే. ఏవో ఒకటీ రెండు అంశాలు అది కూడా సినిమాలు పరంగా కొన్ని సీన్స్ లేదా పోస్టర్స్ పరంగా రాజమౌళి పేరు పరోక్షంగా పలు కాంట్రవర్సీల్లో వినిపించేది కానీ తన పర్శనల్ లైఫ్ కి సంబంధించిన స్పేస్ కోసం ఎప్పుడూ బయటకి వచ్చింది లేదు.
కాగా రాజమౌళి కూడా తన ప్రేమ, పెళ్లి లైఫ్ లో ఆ మధ్య వచ్చిన నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో చాలా సుస్పష్టంగా కూడా రివీల్ చేయడం జరిగింది. చాలా అంశాలు ఆ డాక్యు చిత్రంతో బయటకి వచ్చాయి. కాగా ఇపుడు పాన్ వరల్డ్ లెవెల్లో బిజీగా ఉన్నారు అనుకుంటే ఇపుడు ఊహించని విధంగా ఓ షాకింగ్ వ్యక్తి బయటకి వచ్చి చేసిన కామెంట్స్ ఇపుడు కాక రేపుతున్నాయి.

రాజమౌళి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా యమదొంగ కి ఎగ్జిక్యూటివ్ నిర్మాత యూ. శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ ఇపుడు షాకింగ్ గా మారాయి. తమ కాలేజ్ సమయం నుంచీ ఇద్దరూ మంచి స్నేహితులం అని తమది ఆర్య 2 ట్రాక్ అంటూ చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సరే ఇదంతా బాగానే ఉంది కానీ జక్కన్న విషయంలో మాత్రం సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ మరోరకంగా ఈ ఉదంతం ప్రొజెక్ట్ అవుతుంది.
చాలా మంది ఏకంగా రాజమౌళి మగతనం కోసమే కామెంట్స్ చేసేస్తున్నారు. ఇది వినేందుకే ఒకింత జుగుప్సగా ఉంది కానీ వాక్స్వాతంత్రం అనేది ఒకటి ఉంది కదా అందుకే సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. దీనితో ఇదంతా ఏదో తేడాగా మారింది. ఇక ఇదిలా ఉండగా సినీ వర్గాల్లో మాత్రం మరో కోణం శ్రీనివాసరావు కోసం వినిపిస్తుంది.
అతను కేవలం రాజమౌళి మీద ఈర్ష వల్లే ఇదంతా చేస్తున్నారు కాబోలు అంటూ ఓ టాక్ ఇపుడు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. తాము ప్రాణ స్నేహితులు, రాజమౌళి భార్య రామా రాజమౌళి కూడా తనని టార్చర్ చేస్తున్నారు, రాజమౌళి చేసిన కొన్ని అంశాలు ఎక్కడ బయటపెడతాను అనే నెపంతో తనని టార్చర్ చేస్తున్నారు అని అంటున్నారు కానీ తన దగ్గర సాక్షాలు ఏమన్నా ఉన్నాయా అందుకు సమాధానం తన దగ్గర లేదు.
కానీ ఇపుడు ఉన్న రోజుల్లో పాజిటివ్ కంటే నెగిటివ్ తొందరగా స్ప్రెడ్ అవుతుంది. దీనితో ఇలానే జక్కన్నపై ఈ షాకింగ్ కామెంట్స్ వచ్చి స్ప్రెడ్ అయ్యాయి. కానీ ఇవి ఏకంగా రాజమౌళి పర్శనల్ అంశాలపై కూడా వేలెత్తి చూపించే విధంగా మారడం అనేది మాత్రం ఒకింత బాధాకరమే అని చెప్పక తప్పదు. కాగా ఇంకోపక్క జక్కన్న ఈ అంశంపై స్పందిస్తారా లేక లైట్ తీసుకుంటారా అనేది కూడా ఒకింత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే రాజమౌళి ఫుల్ ఫోకస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న భారీ ప్రాజెక్ట్ పైనే పెట్టారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను లెక్క చేయకుండానే కీరవాణి నిర్వహిస్తున్న ఈవెంట్ గురించి ఆయన ట్వీట్ చేశారు. కీరవాణి నిర్వహించే లైవ్ కాన్సర్ట్‌లో గాయకులందరిని వేదిక చూడబోతున్నందుకు చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాను. మనకు ఫేవరేట్‌గా నిలిచిన సినిమాల్లోని పాటలను స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తుంటే.. సీటుకు అంచున కూర్చొని ఎంజాయ్ చేసేలా ఉంటుంది. పెద్దన్న నిర్వహించే ఈ కార్యక్రమం ఆయన ప్రతిభను చాటి చెబుతుంది. అలాగే ఫుల్ ఫన్ క్రియేట్ చేస్తుంది. మార్చి 22న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో లైవ్ కాన్సర్ట్ జరుగుతుంది అని రాజమౌళి ట్వీట్ చేశారు.
Seeing all the singers share their playlists is making me excited for MMK’s live concert.
— rajamouli ss (@ssrajamouli) February 28, 2025
But what makes me have an edge-of-the-seat experience is imagining him performing the OSTs of our favorite films… Remember peddanna, we are here for the #FullFeastMMK!
Not just songs, we… pic.twitter.com/9dS8AeAbse


Click it and Unblock the Notifications











