»   » సెక్సీ సుందరి..తొలి ఎక్సక్లూజివ్ సెల్ఫీ(ఫొటో)

సెక్సీ సుందరి..తొలి ఎక్సక్లూజివ్ సెల్ఫీ(ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: సెక్సీ సుందరి కత్రినా కైఫ్...రీసెంట్ గా ..సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లోకి వచ్చింది. మరి సోషల్ నెట్ వర్కింగ్ లోకి వచ్చి ఊరికినే కూర్చోలేరు కదా...అందుకే వెంటనే ఓ సెల్ఫీ తీసి తొలి ఎక్సక్లూజివ్ సెల్ఫీ అంటూ పోస్ట్ చేసేసింది. ఇదిగో ఈ ఫోటోనే అది. ఇప్పుడా ఫోటో అభిమానులను అలరిస్తోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బూమ్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్.. తొలి సినిమాతోనే తన గ్లామర్ సత్తా ఏంటో నిరూపించింది. అరంగేట్రం చేసిన తొలినాళ్లలో కేవలం తన అందచందాలతోనే బండిని నెట్టుకొచ్చిన కత్రినా...తెలుగులో మల్లీశ్వరి, అల్లరి పిడుగు చిత్రాలు చేసింది. తర్వాత సల్మాన్ ఖాన్ దృష్టిలో ఎప్పుడు పడిందో.. అప్పుడే అమ్మడి దశ తిరిగిపోయింది. సల్మాన్ చొరవతో అటు గ్లామర్ పరంగా, ఇటు పెర్ఫామెన్స్ పరంగా రాటు దేలిన క్యాట్.. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Here is sexy diva Katrina 's first exclusive selfie!

అనంతరం షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి టాప్ లీగ్ లో బెర్త్ కన్ఫమ్ చేసుకుంది. సల్మాన్ అండతో పాటు ఇతర హీరోల అండదండలు కూడా కలసిరావడంతో.. బాలీవుడ్ లో పుష్కరకాలం రాజ్యమేలుతోంది. అయితే ఇప్పటి వరకు ఎక్స్ బాయ్ ప్రెండ్ సల్మాన్ సహా ఇతర సీనియర్ హీరోల సినిమాలతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇకపై మాత్రం జూనియర్స్ కే ప్రయారిటీ ఇస్తానంటోంది.

సల్మాన్, షారుఖ్, అమీర్.. ఈ ముగ్గురు నలభై ఐదులు దాటిన వారు. మరి వీరితో రొమాన్స్ చేసి కత్రినాకు విసుగొచ్చిందేమో కానీ.. ఇకపై అంత కుర్ర హీరోలతోనే నటించాలని భావిస్తోందట. ప్రస్తుతం క్యాట్ చేస్తున్న సినిమాలు అన్నీ కూడా ఆమె ఏజ్ గ్రూప్ హీరోలు లేక తనకంటే తక్కువ వయస్సున్న హీరోలతోనే.

రిలీజ్ కు రెడీ అవుతున్న జగ్గూ జాసూస్ లో హీరో రణ్ బీర్ కపూర్ తో పాటు ఫితుర్ మూవీలో హీరో ఆదిత్యా రాయ్ కపూర్ కత్రినా కంటే రెండేళ్లు చిన్న. ఇకపోతే.. నిత్య మెహ్రా దర్శకత్వంలో కమిట్ అయిన సినిమాలోనూ తనకంటే చిన్నవాడు అయిన సిద్ధార్థ్ మల్హోత్రాతోనే రొమాన్స్ చేస్తోంది క్యాట్. చేతిలో ఉన్న సినిమాలే కాదు.. ఇకపై కూడా కుర్రహీరోలకే తన ఓటు అంటోంది ఈ బ్యూటీ.

English summary
Katrina signed up on the social networking site last weekend and she shared her first selfie in the twitter."Thank you for all the love! Not really a selfie person but my first exclusive one for all my beautiful fans," she tweeted.
Please Wait while comments are loading...